IMDB Top Rated Movies : థియేటర్లలో విడుదలయ్యే కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద, టీవీల్లో రిలీజయ్యే సీరియల్స్ స్మాల్‌స్క్రీన్‌పై కలెక్షన్స్ పరంగా, ఆదరణ పరంగా రికార్డులు బ్రేక్ చేసి సూపర్ హిట్‌గా నిలుస్తుంటాయి. మరికొన్ని సినిమాలు, ధారావాహికలను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. జీవితాంతం వాటిని గుర్తుపెట్టుకుంటారు. అయితే అలా మంచి టాక్ తెచ్చుకునే సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు, సీరియల్స్‌కు, టీవీషోలకు ప్రముఖ ఆన్లైన్ డేటాబేస్ సంస్థ ఐఎండీబీ రేటింగ్‌లు ఇస్తుంటుంది. అలా IMDB వద్ద మంచి రేటింగ్ సాధించిన చిత్రాలు, షోలు, వెబ్‌సిరీస్‌లు, సీరియల్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఐఎండీబీ ఇచ్చే హైయెస్ట్ రేటింగ్ 10కి 9 రేటింగ్‌ను దక్కించుకున్నాయి.
రామాయణ్ సీరియల్(1987-1988)
వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ ఆధారంగా దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' ఒక హిందీ సీరియల్. ఈ ధారావాహిక ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక సీరియల్‌గా 'రామాయణ్' రికార్డు సృష్టించింది. ఇది 1987లో డీడీ ఛానల్లో ప్రసారమైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అహ నా పెళ్లంట(1987)
రాజేంద్రప్రసాద్, రజనీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన 'అహ నా పెళ్లంట' తెలుగు సినిమా ఇప్పటికీ ఓ కామెడీ సెన్సేషన్. ఈ సినిమాలో బ్రహ్మానందం చేసిన కామెడీ, డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓ మైలురాయిగా నిలిచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆషి హి బన్వా బన్వి(1988)
1966లో హృషికేశ్ ముఖర్జీ తెరకెక్కించిన 'బీవీ ఔర్ మకాన్' ఆధారంగా 'ఆషి హి బన్వా బన్వి' మరాఠీ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు సచిన్ పిల్గాఓంకర్ దీనిని రూపొందించారు. ఆయన తీసిన కల్ట్ సినిమాలలో ఇదీ ఒకటి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సందేశం(1991)
భారతీయ గొప్ప చిత్రాల్లో మలయాళ భాషకు చెందిన 'సందేశం' సినిమా ఒకటి. సమకాలీన కేరళ రాజకీయాలను ఉద్దేశిస్తూ, సెటైర్లు వేస్తూ దర్శకుడు సత్యన్ అంతికాడ్ ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీ పేరుకు తగ్గట్టే ఈ చిత్రం కేరళ ప్రజలకు రాజకీయాలపై మంచి సందేశాన్ని ఇచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మహాభారతం(2013-14)
రూ.100 కోట్లతో తెరకెక్కించిన మొదటి ఇండియన్ హిందీ సీరియల్ 'మహాభారతం'. 2013లో స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమైన ఈ సీరియల్‌ను ఆడియెన్స్ విశేషంగా ఆదరించారు. ఈ ధారావాహిక ఎపిసోడ్స్‌ను చూసేందుకు ఇప్పటికీ ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యే మేరీ ఫ్యామిలీ(2018-2023)
వేసవికాల సమయంలో 1998లో జైపుర్‌లో వచ్చిన ఓ వైరల్ ఫీవర్ ఆధారంగా 'యే మేరీ ఫ్యామిలీ' హిందీ టీవీ షోను తెరకెక్కించారు. 12 ఏళ్ల బాలుడి ఆరోగ్యం కోసం ఓ కుటుంబం పడే తపనను కథగా తీసుకొని దీనిని రూపొందించారు. ఇందులో మోనా సింగ్ తల్లి పాత్రను పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">