ETV Bharat / entertainment

బన్నీకి సర్​ప్రైజ్ గిఫ్ట్​- కానీ పంపింది ఎవరో తెలీదు - Allu Arjun Received Gift - ALLU ARJUN RECEIVED GIFT

Allu Arjun Received Gift: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఓ బహుమతి పంపారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Allu Arjun Received Gift
Allu Arjun Received Gift (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 5:24 PM IST

Updated : Sep 15, 2024, 6:43 PM IST

Allu Arjun Received Gift: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్​గా ఉండే బన్నీ తన పర్సనల్, సినిమా అప్డేట్స్​ ఫ్యాన్స్​తో షేర్​ చేసుకుంటారు. తాజాగా ఆయన ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన ఓ పోస్ట్‌ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ పుస్తకాన్ని గిఫ్ట్​గా పంపారంటూ ఆయన పేర్కొన్నారు.

'గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు ఈ పుస్తకాన్ని పంపించారు. అతడి నిజాయితీ, నాపై చూపించిన చొరవతో మనసు నిండింది. ఒక పుస్తక ప్రియుడిగా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్‌ ది బెస్ట్‌' అని పేర్కొన్నారు. ఈమేరకు ఆ వ్యక్తి పంపిన 'Burned Beneath the Fire of Desire' అనే పుస్తకం ఫొటోను షేర్ చేశారు.

గుర్తు తెలియని వ్యక్తి  పంపిన గిఫ్ట్
గుర్తు తెలియని వ్యక్తి పంపిన గిఫ్ట్ (Source: Allu Arjun Post Screen Shot)

కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప- 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, గ్లింప్స్​కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. 2021 బ్లాక్​బస్టర్ పుష్ప సినిమాకు సీక్వెల్​గా డైరెక్టర్ సుకుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి పార్ట్​కు భారీ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సీక్వెల్​ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక డిసెంబర్ 6న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Pushpa OTT Deals: రిలీజ్​కు ముందే ఈ మూవీ డిజిటల్ రైట్స్ పూర్తైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుందట. తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ అన్ని భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.270 కోట్లకు దక్కించుకున్నట్లు ఇన్​సైడ్ టాక్. ఒకవేళ ఇది నిజమైతే పుష్ప-2 సరికొత్త రికార్డు నెలకొల్పినట్లవుతుంది. భారతీయ సినీ ఇండస్ట్రీ ఓటీటీ డీల్స్​లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక రష్మిక మంధాన హీరోయిన్​గా నటించగా, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

'లవ్ యూ మై డియర్ ఆర్మీ- మిమ్మల్ని చూసే హీరో అయ్యా' - ALLU ARJUN Pushpa

2025కు 'పుష్ప 2'! - రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : Sep 15, 2024, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.