Hrithik Roshan Fighter collections : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకుణె కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ 'ఫైటర్'. ఏరియల్ యాక్షన్ డ్రామాగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలోకి వచ్చింది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ టాక్ అందుకుని మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తోంది.
ట్రెడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా రూ.337 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.24.60 కోట్లు వచ్చాయి. అలా మూడు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇటీవలే ఈ కలెక్షన్స్‌పై హృతిక్ రోషన్ స్పందించారు. ' ఇంత మంది విజయం సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ ఫైట్‌ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఫైటర్‌గా గర్వపడుతున్నా' అని హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
Fighter OTT Release Date: ఇకపోతే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమాను మార్చి 21నుంచి స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తర్వలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే యాక్షన్ చిత్రం ఇది. హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) అనే ప్రధాన పాత్రలో కనిపించారు. మరో స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా (దీపికా పదుకొనే) నటించింది. ఇక గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రను అనిల్ కపూర్ పోషించారు. వయాకామ్ 18 స్టూడియోస్-మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక బాలీవుడ్ మ్యూజిక్ సెస్సేషన్ విశాల్- శేఖర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించారు. పలువురు సినీ, క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. మరోవైపు హృతిక్ రోషన్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'వార్ 2'లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
రెండు అక్షరాల టైటిల్లో ఏడాది ప్రేమ కథ- రీరిలీజ్‌కు ముందు గుట్టు విప్పిన డైరెక్టర్
మహేశ్ - రాజమౌళి మూవీ టెక్నికల్ టీమ్ ఫుల్ లిస్ట్ - ఆ ఒక్కరు తప్ప అంతా ఛేంజ్!