Horror Movies OTT : హారర్ జానర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. మూవీ లవర్స్ ఎక్కువగా ఈ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలానే ఈ చిత్రాలు కూడా భయపెడుతునే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటాయి. ఓటీటీ సంస్థలు కూడా ఈ తరహా జానర్ చిత్రాలను ఎక్కువగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అలా ఇప్పుడు మూడు సూపర్ బిగ్గెస్ట్ హారర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే. హాలీవుడ్లో ఈ మధ్య బాగా భయపెట్టిన సూపర్ హిట్ హారర్ మూవీస్ 'సాటెన్', 'ది నన్ 2', 'ది ఎగ్జార్సిస్ట్'. ప్రస్తుతం ఈ చిత్రాలకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదట 'సా టెన్' సినిమా సినిమా గతేడాది సెప్టెంబర్ 29న విడుదలై మంచి హిట్‌ను అందుకుంది. 13 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 111 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. సా ఫిల్మ్ సిరీసులో ఇది పదో సినిమా కావడం విశేషం. అందుకే సా టెన్ అని ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. 2004లో మొదటి భాగం వచ్చింది. ఆ తర్వాత 2010 వరకు ప్రతి ఏడాది ఫ్రాంఛైజీ నుంచి సీక్వెల్ విడుదలై విజయం సాధించాయి. ఆ తర్వాత 7 ఏళ్ల గ్యాప్ ఇచ్చి సీక్వెల్స్‌లో భాగంగా 2017లో 8వ చిత్రంగా జిగ్సా రిలీజైంది. 2021లో స్రైరల్ పేరుతో 9వ చిత్రం రాగా, అనంతరం 2023లో సాటెన్ విడుదలైంది. ఇది ప్రస్తుతం లయన్ గెట్స్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరో హారర్ మూవీ 'ది ఎగ్జార్సిస్ట్ : బిలీవర్'. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులోకి ఉంది. ఆ మధ్య థియేటర్లలోకి వచ్చి భయపెట్టిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో భయపెడుతోంది. ఇక మరో భయపెట్టించే చిత్రం 'ది నన్ 2'. 'ది నన్' తొలి భాగం 2018లో విడుదల అవ్వగా దానికి సీక్వెల్‌గా గతేడాది 'ది నన్2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇప్పుడు జియో సినిమాలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో కూడా అందుబాటులో ఉంది. మరి మీరు ఈ మూడు చిత్రాలను చూడాలనుకుంటే ఈ సండే మీ ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా చూస్తూ ఎంజాయ్ చేయండి.
ఆపరేషన్ వాలంటైన్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అసలు పేరు ఇదా?
శ్రీలీల ఎనర్జీ డ్యాన్స్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఇదే - మీకు తెలుసా?