Honey rose Rani real story Movie OTT : హానీ రోజ్ ఈ పేరు గతేడాది ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్ సినీ ప్రేక్షకులంతా ఈ పేరే బాగా జపం చేశారు. మలయాళ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు వారిని బాగా ఆకట్టుకుంది. రీఎంట్రీలో తన తొలి సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందం అభినయంతో కట్టపడేసింది. దీంతో ఈ అమ్మడిని మరోసారి తెరపై చూడాలని చాలా మంది ఊవ్విళ్లూరారు.
కానీ హనీ రోజ్ మాత్రం ఏడాదిన్నార అయిపోయిన ఇప్పటి వరకు కనపడలేదు. కేవలం సోషల్ మీడియాతోనే నెట్టుకొస్తోంది. షాపింగ్ మాల్ లేదా ఇతర ఈవెంట్ల ఫంక్షన్లలో సందడి చేస్తూ కనిపిస్తోంది. లేదంటే నెట్టింట్లో తన భారీ అందాల గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి తెరపై కనిపించేందుకు రెడీ అయింది.
అది కూడా వెండితెరపై కాదు. ఓటీటీ తెరపై. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలను తెగ చూసేస్తున్నారు మూవీ లవర్స్.అయితే అలా స్ట్రీమింగ్ అయ్యే వాటిలో మలయాళ చిత్రాలే ఎక్కువగా ఉంటున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో మలయాళ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అందులోనే హనీ రోజ్ నటించింది.
రాణి : ది రియల్ స్టోరీ చిత్రం 2023 సెప్టెంబర్‌లో విడుదలైంది. కేరళలో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. మార్చి 7 నుంచి మనోరమ మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో అఫీషియల్ పోస్ట్ చేశారు. కేవలం మలయాళ ప్రేక్షకుల మాత్రమే అందుబాటులో ఉండనుంది.
ఈ చిత్రానికి శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించారు. పొలిటీషియన్ ధర్మరాజన్‌ను రహస్యంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పనిమనిషి జీవితం ఏ విధంగా ఊహించని మలుపు తిరిగింది అనే కథాంశంతోనే ఈ సినిమాను రూపొందించారు. కాగా, ఈ చిత్రంలో హనీ రోజ్‌తో పాటు గురు సోమసుందరం, అశ్విన్ గోపీనాథ్, ఇంద్రన్స్, భావన, అశ్వత్ లాల్, మాలా పార్వతి, నియతి కాదంబి, ఊర్వశి, అనుమోల్ కీలక పాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆ స్టార్ హీరోనే నా స్ఫూర్తి - సమంత
'షూటింగ్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ