ETV Bharat / entertainment

'టార్జాన్' హీరో కన్నుమూత - సినీ ప్రముఖులు సంతాపం - TARZAN HERO DIED

86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన 'టార్జాన్' హీరో

Tarzan Hero Ron Ely Died
Tarzan Hero Ron Ely Died (source Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2024, 8:00 AM IST

Tarzan Hero Ron Ely Died : ప్రముఖ హాలీవుడ్ టీవీ సిరీస్​ టార్జాన్, సినీ ప్రేమికులకు తెలిసే ఉంటుంది. ఇక్కడి ఆడియెన్స్​ను కూడా బానే ఆకట్టుకుంది. అయితే నేడు (అక్టోబర్ 24) ఈ సిరీస్​ హీరో రాన్ ఎలీ కన్నుమూసినట్లు తెలిసింది. టార్జాన్​లో తన పాత్రకు పేరు గాంచిన రాన్ ఎలీ 86 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కిర్​స్టెన్​ ఎలీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. అయితే ఎప్పుడు, ఎలా చనిపోయారనేది చెప్పలేదు.

ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. నేను నా తండ్రిని కోల్పోయాను. ఆయన్ను అందరూ హీరోగా పిలుస్తుంటారు. నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా, నాయకుడిగా రాణించిన బహుముఖ వ్యక్తి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పవర్ పుల్​ పాజిటివ్​ వైబ్స్​ను క్రియేట్ చేసేవారు. ఆయన ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండేది. అలా ప్రభావం చూపే వ్యక్తులను ఆయన్ను తప్ప ఇంకెవరినీ చూడలేదు. మా నాన్నే నా ప్రపంచం. నా రోల్ మోడల్ ఆయనే. ఎంతో ఒదిగి ఉండేవారు. ఓ బలమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఆయన ఎంతో బలంగా, తెలివిగా, ఫన్నీగా, సెన్సిటివ్​గా ఉండేవారు. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు." అని ఆమె రాసుకొచ్చింది.

కాగా, రాన్ ఎలీ మరణం హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మోక్షజ్ఞ సినిమా షూట్​ షురూ అయ్యేది అప్పుడే!

'అందుకే గ్లామరస్ పాత్రలకు దూరం- ఆ ఒక్క వీడియోనే కారణం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.