ETV Bharat / entertainment

ఆ నవ్వు చూశారా ఇక అంతే! - ఓటీటీలో భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ మూవీ - OTT Horror Film - OTT HORROR FILM

Hollywood Horror Film Smile Movie OTT : నవ్వుతోనే భయపెడుతున్న ఓ హారర్​ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. వివరాల కోసం స్టోరీ పూర్తిగా చదవండి.

Getty images
Getty images (Getty images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 2:50 PM IST

Hollywood Horror Film Smile Movie OTT : ఆ భయంకరమైన నవ్వు చూసినవాళ్లు ఎవరూ బ్రతకరు. ఆ నవ్వు ఒక వైరస్. అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది. ఆపైన వింతగా ప్రవర్తించేలా చేసి చివరకి నవ్వుతూ ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. ప్రాణాలు తీసుకునేటప్పుడు చూసినవారికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. అంతే వాళ్లకి ఇలాగే జరుగుతుంది. ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. అదే స్మైల్ మూవీ స్టోరీ లైన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.

2022 సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ హాలీవుడ్ చిత్రం స్మైల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. డైరెక్టర్ పార్కర్ ఫిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2020లో ఫిన్ తెరకెక్కించిన లారా హాజెంట్ స్లేప్ట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. 2023 జూన్ నుంచే నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.75 రూపాయల అద్దెతో ఈ మూవీని చూడొచ్చు.

కథేంటంటే?- సోసి బెకాన్ అనే సైకాలిజిస్ట్ ఒక ఎమర్జెన్సీ కేసు విషయమై లారా వీవర్ అనే సైకాలజీ స్టూడెంట్​కు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే చికిత్స చేస్తున్నప్పుడే లారా వింతగా ప్రవర్తిస్తూ నవ్వుతూ తనను తాను పొడుచుకుని ప్రాణాలు కోల్పోతుంది. ఇక అప్పటినుంచి సోసి తన జీవితంలో వింత పరిస్థితులు ఎదుర్కొంటూ తనవారందరికి దూరం అవుతుంది. వరుసగా చాలా మంది చనిపోతుంటారు. చివరికి తన మాజీ ప్రియుడైన ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో ఆ కేసు పూర్తి వివరాలు సేకరిస్తుంది సోసి. చివరికి తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఏం ఆమె ఏం చేసింది? అసలు నవ్వుతో చంపేస్తున్న ఆ శక్తి ఏంటి? ఇంతకీ దీని వల్ల ఎందుకు చనిపోతున్నారు? అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఈ వీకెండ్ లో థ్రిల్లింగ్ ఎక్సపిరియెన్స్ కావాలంటే స్మైల్ లాంటి సైకాలిజికల్ సూపర్ నేచురల్ హారర్ సరైన అప్షన్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్రిషకు అదంటే బాగా పిచ్చి - లేకుండా అస్సలు ఉండలేదట! - Happy Birthday Trisha

జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే! - Janhvikapoor HOUSE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.