ETV Bharat / entertainment

ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో నటించాలని ఉంది : హాలీవుడ్ స్టార్​ నటి - Anne Hathway RRR Movie - ANNE HATHWAY RRR MOVIE

Anne Hathway Comments on RRR movie : ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ నటి అన్నా హాత్​వే ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించింది. ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను చెప్పింది. పూర్తి వివరాల స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

Source ANI
RRR Movie (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 5:43 PM IST

Anne Hathway Comments on RRR movie : రిలీజై రెండేళ్లైనా ఆర్ఆర్ఆర్​కు ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచి టాలీవుడ్​ను ప్రపంచ సినిమా ముందు నిలిపింది. అలానే సినిమాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్​ను గ్లోబల్ స్టార్స్​ను చేసింది.

అయితే ఈ చిత్రంపై ఇండియన్ స్టార్స్​తో పాటు హాలీవుడ్​ సినీ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అలానే చాలా మంది ఆర్​ఆర్​ఆర్ లాంటి సినిమాలో నటించాలని ఆసక్తి చూపించారు. తాజాగా ఆ లిస్ట్​లో ఆస్కార్ అవార్డు గ్రహీత అన్నా హాత్ వే కూడా చేరిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్​తో నటించడానికి ఆసక్తి ఉన్నట్లు తన మనసులో మాటను బయటపెట్టింది.

న్యూయార్క్​లో తాను నటించిన ఐడియా ఆఫ్​ యు మూవీ ప్రీమియర్స్​లో పాల్గొన ఈ భామ అక్కడ మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని చెప్పింది. ఇండియన్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతూ నాకు ఆర్ఆర్ఆర్ బాగా నచ్చింది. అలాంటి మూవీ టీమ్​తో పనిచేయడం అంటే ఎవరికైనా కల నెరవేరినట్టే అంటూ చెప్పుకొచ్చిందీ 41 ఏళ్ల హాలీవుడ్ బ్యూటీ.

ప్రస్తతం అన్నా హాత్​వే చేసిన కామెంట్స్ బాగా వైరల్​ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ ఆడియెన్స్​ రాజమౌళి మహేశ్ బాబు కాంబోలో రానున్న SSMB 29(Rajamouli Mahesh babu movie) సినిమాలో ఈమె నటించే అవకాశం ఉంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఇంకా చాలా మంది నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ చిత్ర నిర్మాత కె ఎల్ నారాయణతో పాటు మూవీ టీం తమ అధికారిక సోషల్ మీడియా పోస్ట్లను తప్ప ఇంకెలాంటి రూమర్స్ నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చారు.

కాగా, గ్లోబల్ మార్కెట్ టార్గెట్​గా అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ పూర్తి కావడానికి మరో రెండు, మూడేళ్లైనా పట్టే అవకాశం ఉంది.

సమంతతో రొమాంటిక్ సీన్స్​ - వైరల్​గా నాగ చైతన్య రియాక్షన్ వీడియో - Manam Movie Rerelease

అనసూయ జలకాలాట - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ చూశారా? - Anasuya Vacation Tour Pics

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.