Viswak Sen Gangs Of Godavari : తనకు ఛాన్స్ వస్తే ఫ్యాన్స్ కోసం మాత్రమే హారర్ మూవీస్ చేస్తానని టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ అన్నాడు. తాను హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
"పర్సనల్‌గా నాకు హారర్ జానర్ అంటే ఇష్టం లేదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ తీసిన సినిమాలు ఏవీ నన్ను భయపెట్టలేదు. ఎప్పుడైనా థ్రిల్ కోసం ఏ హారర్ మూవీ చూసినా, చివరికి డిసప్పాయింట్‌మెంటే మిగిలేది. నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రేక్షకులు, అభిమానుల కోసమే హారర్ మూవీస్ చేస్తాను" అని విశ్వక్ చెప్పాడు. తన హిట్ మూవీ ఫలక్‌నుమా దాస్ విడుదలైన తేదీన (మే 31) ఈ ఏడాది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉందని చెప్పాడు.
ఇంటర్వ్యూలో విశ్వక్ ముంబయిలో యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. "అప్పుడు నా వయసు 17 ఏళ్లు. నేను మాట్లాడే హిందీ అక్కడి వారికి అర్థంకాక నవ్వేవారు. అక్కడ ఓ స్కిట్‌తో నేనేంటో నిరూపించుకున్నా" అని చెప్పాడు.
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తున్న బాలయ్య
రిలీజ్‌కు డేట్ దగ్గరకు వస్తుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించనుంది. ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. - మే 31న రిలీజ్ - ఈ నెల 31న శుక్రవారం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రీలీజ్ అవుతోంది. ఈ చిత్రం 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందింది. అప్పటి పరిస్థితుల ఆధారంగా రాజకీయాలు ఇతివృత్తంగా సినిమాను రూపొందించారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఇటీవల రిలీజ్ అయిన మూవీ టీజర్‌కి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. గోదావరి యాసలో విషక్ చెప్పిన డైలాగ్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ‘మనుషులు మూడు రకాలు, మగ, ఆడ, రాజకీయ నాయకులు’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
రూ.190కోట్ల బడ్జెట్ - కలెక్షన్స్ రూ.15 కోట్లే! - Biggest Disaster movie
ఈ వారం 15 క్రేజీ సినిమా/సిరీస్‌లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases