ETV Bharat / entertainment

కాజల్ అగర్వాల్ కోసం రంగంలోకి దిగిన బాలయ్య- ఇక దబిడి దిబిడే - Kajal Satyabhama Trailer - KAJAL SATYABHAMA TRAILER

Kajal Satyabhama Trailer: హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోసం నందమూరి నటసింహం బాలయ్య రంగంలోకి దిగారు.

Kajal Satyabhama Trailer
Kajal Satyabhama Trailer (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 5:19 PM IST

Kajal Satyabhama Trailer: టాలీవుడ్ చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆడియెన్స్​ను అలరిస్తూనే ఉంది. అయితే కరోనా టైమ్​లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు జోరు పెంచింది. ఓ వైపు తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే సినీ లైఫ్​ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సత్యభామ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

అయితే ఇప్పుడు తన కోసం ఏకంగా నందమూరి నటసింహం బాలయ్యనే రంగంలోకి దింపేందుకు రెడీ అయింది. తన కొత్త సినిమా ప్రమోషన్స్​ను భుజాన వెసుకున్న ఈ భామ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్​కు బాలయ్యను గెస్ట్​గా పిలిచింది. బాలయ్య కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. 'నందమూరి బాలకృష్ణ సత్యభామ్​ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్​కు రాబోతున్నారు. అందరూ రెడీగా ఉండండి' అంటూ రాసుకొచ్చింది. 'మీ క్యాలెండర్స్​ను మార్క్ చేసుకోండి 24 మే హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ జరగనుంది' అని తెలిపింది.

కాగా, కాజల్ అగర్వాల్ తన గత సినిమా భగవంత్ కేసరిలో బాలకృష్ణతో కలిసి చేశారు. ఇందులో వీరిద్దరి ఫన్నీ కెమిస్ట్రీ ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు ఈ ట్రైలర్ ఈవెంట్​కు బాలయ్య రాబోతుండన్నారని తెలియడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఇక సత్యభామ విషయానికొస్తే లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్​గా రూపొందింది. హీరో నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ప్రకాశ్​ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్​పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. మే 31 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఒంటరిగా ఉన్నప్పుడు అతడు షర్ట్ తీసేసి అలా చేశాడు- భయపడిపోయా' - Kajal Agarwal Satyabhama

'ఆడిషన్స్​లో అలా చేయలేకపోయా - మా నాన్న తిట్టాక ఓకే అయ్యింది' - Kajal Aggarwal First Movie Audition

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.