Hema Committee Report Malayalam Actor Mukesh Rape Case : మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదయ్యాయని తెలిసింది. అయితే తాజాగా మరో కేసు నమోదైంది.
కేరళకు చెందిన ప్రముఖ యాక్టర్, అధికార పార్టీ CPI(M) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై రేప్ కేసును నమోదు చేశారు పోలీసులు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఆరోపణలు మేరకు కేసును రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కొచి నగరంలోని మారడు పోలీస్ స్టేషన్లో ఐపీసి 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) అమల్లోకి రాకముందే ఈ సంఘటన జరిగినందున ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. హేమ కమిటీ రిపోర్ట్ వెలువరించిన తర్వాత మలయాళ ఇండస్ట్రీలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇది.
ఇంకా నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఫోర్ట్ కొచి పోలీస్ స్టేషన్లో సెక్షన్ 354 కింద రాజుపై కేసు రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని ఎర్నాకులంకు చెందిన ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ఇదే సెక్షన్ కింద జయసూర్యపై కేసు రిజిస్టర్ అయినట్లు తిరువంతపురంలోని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
రిజిస్టర్ అయిన మరో రెండు రేపు కేసులు ఇవే - అంతకుముందు తిరువంతపురం మ్యూజియమ్ పోలీసులు నటుడు సిద్ధిఖీపై రేప్ కేసు నమోదు చేశారు. ఆయన ఎనిమిదేళ్ల క్రితం హోటల్లో ఓ నటిపై అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల వల్ల ఈ కేసును రిజిస్టర్ చేశారు.
అలానే దర్శకుడు రంజిత్‌పై కూడా పశ్చిమ బంగాకు చెందిన ఓ నటి ఆరోపణలు చేసింది. ఆయన తనను అసభ్యకరంగా తాకారని ఫిర్యాదు చేసింది. 2009లో ఈ సంఘటన జరిగినట్లు చెప్పింది. దీంతో ఆయనపై కూడా రేప్ కేసు నమోదు చేశారు.
అలా మలయాళ ఇండస్ట్రీలో ముగ్గురు ప్రముఖులపై రేప్ కేసు నమోదైంది. ఈ ఆరోపణల వల్ల కేరళ చలన చిత్ర అకాడమీ ఛైర్మన్‌గా ఉన్న రంజిత్ తన పదవికి రాజీనామా చేశారు. సిద్ధిఖీ కూడా 'AMMA' జనరల్ సెక్రెటరీ పదవికి రిజైన్ చేశారు.
'ఇప్పటికైనా అలా జరగాలని ఆశిస్తున్నా' - హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత - Samantha Hema Committee Report
హేమ కమిటీ రిపోర్ట్ ఎఫెక్ట్ - మోహన్‌లాల్ సహా 17 మంది 'అమ్మ'కు రాజీనామా - Mohanlal AMMA Resignation