ETV Bharat / entertainment

మెగాస్టార్​తో హరీశ్ శంకర్ కొత్త ప్రాజెక్ట్! - Harish Chiranjeevi Upcoming Cinema

Harish Shankar Chiranjeevi New Project : మెగా ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​. పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​కు గబ్బర్​సింగ్​తో బ్లాక్​బస్టర్​ హిట్​ ఇచ్చిన దర్శకుడు హరీశ్​ శంకర్​ త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి​తో కలిసి ఓ సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించిన వార్తలు ఫిల్మ్​నగర్​లో చక్కర్లు కొడుతున్నాయి.

Harish Shankar Megastar Chiranjeevi New Project

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 12:59 PM IST

Harish Shankar Chiranjeevi New Project : టాలీవుడ్​లో ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోలకు ఏమాత్రం తీసిపోరు 'మెగాస్టార్​ చిరంజీవి'. ఆరుపదుల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు దీటుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. లాంగ్​ గ్యాప్​ తర్వాత 'ఖైదీ నెం.150'తో సిల్వర్​స్క్రీన్​పై హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చి మరో బ్లాక్​బస్టర్ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'సైరా నర్సింహారెడ్డి', 'ఆచార్య', 'గాడ్​ఫాదర్​', 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్​' సినిమాలతో అలరించారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 157వ సినిమాకి సంబంధించి బిగ్​ అప్డేట్​ ఇండస్ట్రీలో హాట్​టాపిక్​గా మారింది.

సహ-నిర్మాతగా కూతురు?
పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​కు 'గబ్బర్​సింగ్​'తో బిగ్గెస్ట్​ బ్లాక్​బస్టర్​ అందించిన దర్శకుడు హరీశ్​ శంకర్​తో కలిసి మెగాస్టార్​ ఓ ప్రాజెక్ట్​ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీవీఎస్​ రవి ఈ సినిమాకు కథను అందిస్తుండగా, పీపుల్​ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుందని సినీ వర్గాలు తెలిపాయి. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల కో-ప్రొడ్యూసర్​గా వ్యవహరించనున్నారట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​కు చిరంజీవి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ త్వరలోనే రానున్నట్లు సమాచారం.

హరీశ్​ తెరకెక్కిచేంది ఆ కథేనా?
'భోళా శంకర్​' చిత్రీకరణ సమయంలో 'బంగర్రాజు' దర్శకుడు కళ్యాణ్​ కృష్ణతో ఓ సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. ఇందుకోసం ఆల్రెడీ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్​తో స్క్రిప్ట్​ కూడా రెడీ చేయించారు. అయితే ఈ కథ 2022లో మలయాళంలో విడుదలైన 'బ్రో డాడీ'కి రీమేకే అని జోరుగా ప్రచారం కూడా సాగింది. ఈ సినిమాను చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలే ప్రొడ్యూస్​ చేసేందు రెడీ అయింది. ఏమైందో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్​ పట్టాలెక్కలేదు. ఇక తాజాగా హరీశ్​ శంకర్​కు ఛాన్స్​ ఇచ్చిన చిరంజీవి, తాను చేసే సినిమాలో ప్రసన్నకుమార్​ రాసిన కథనే ఉంటుందా? లేదా కొత్త కథతో ముందుకువస్తారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రస్తుతం మాస్​మహారాజా రవితేజతో కలిసి చేస్తున్న 'మిస్టర్ బచ్చన్' షూటింగ్​లో బిజీగా ఉన్నారు హరీశ్​. ఈ ప్రాజెక్ట్​ తర్వాత పవన్​ కల్యాణ్​తో ఇప్పటికే మొదలుపెట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్​'కు సంబంధించి మిగిలిన షూటింగ్​ను పూర్తి చేసుకొని మెగాస్టార్​తో జతకట్టనున్నారట​. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి నేపథ్యంలో పవన్​తో స్టార్ట్​ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్​' చిత్రీకరణకు బ్రేక్​ పడిన విషయం తెలిసిందే.

మరోవైపు చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం 'విశ్వంభర'లో నటిస్తున్నారు. దీనిని యూవీ క్రియేషన్స్​ సంస్థ నిర్మిస్తోంది. చిరంజీవి కెరియర్​లోనే అత్యంత హైబడ్జెట్​ మూవీగా ఇది రూపొందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'విశ్వంభర' - 68 ఏళ్ల వయసులో జిమ్‌లో మెగాస్టార్ కసరత్తులు

హీరోగా ఎంట్రీగా ఇవ్వనున్న బిగ్​ బాస్​-7 ఫేమ్​ అమర్​దీప్​- హీరోయిన్​ ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.