ETV Bharat / entertainment

'హ్యాపీడేస్' రీ రిలీజ్- సినిమాలో నటించిన హీరోకే తెలియదట! - Happy Days Re Release - HAPPY DAYS RE RELEASE

Happy Days Re Release: క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా హ్యాపీడేస్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రీరిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ రీ రిలీజ్ గురించి అందులో నటించిన హీరో వరుణ్ సందేశ్​కు తెలియదట! అదేంటీ తాను నటించిన సినిమా రీరిలీజ్ గురించి వరుణ్ కు తెలియదా అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.

Happy Days Re Release Date
Happy Days Re Release Date
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 7:09 PM IST

Happy Days Re Release: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హ్యాపీ డేస్. 2007లో విడుదలైన ఈ చిత్రం యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్‌గా ప్రేక్షకులని అలరించింది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుని సంచలనం సృష్టించింది. వరుణ్ సందేశ్, తమన్నా , నిఖిల్ సిద్ధార్థ్ వంటి న్యూ కమ్మర్స్‌తో దర్శకుడు శేఖర్ కమ్ముల వెండితెరపై మ్యాజిక్ చేశారు.

శేఖర్ కమ్ముల అద్భుతమైన డైరెక్షన్, నటీనటులు పెర్ఫార్మెన్స్, మిక్కీ జే మేయర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకుల మనసులో ఈ సినిమాను ఎవర్ గ్రీన్‌గా నిలిపింది. అయితే యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ హ్యాపీ డేస్ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ గురించి ఇందులో నటించిన హీరోకే తెలియదంట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే?

టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటించిన 'శబరి' సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ గురువారం హైదరాబాద్​లో గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు యంగ్ హీరో వరుణ్ వరుణ్‌ సందేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ క్రమంలో 'హ్యాపీడేస్ రీ రిలీజ్​ను థియేటర్​లో చూడాలనుకుంటున్నారా?' అని ఓ విలేకరి ప్రశ్నించారు. అప్పుడు తనకేమి తెలియదన్నట్లు వరుణ్ ఉండిపోయారు. దీంతో వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటించిన సినిమా రీ రిలీజ్ గురించి అతడికే తెలియదా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

హ్యాపీడేస్​తో పరిచయం
వరుణ్ సందేశ్ 'హ్యాపీ డేస్' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 'కొత్త బంగారులోకం', 'కుర్రాడు' సినిమాలతో యూత్​లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 2016లో తన సహ నటి వితికా షేరును పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో నటించారు. ఆ తర్వాత వరుణ్ నుంచి పెద్దగా సినిమాలు రాలేదు. మళ్లీ తెలుగు 'బిగ్ బాస్ సీజన్ 3' ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అదే సీజన్ లో వరుణ్ భార్య వితికా కూడా 'బిగ్ బాస్' షో లో పాల్గొ న్నారు. దీంతో 'బిగ్ బాస్' హౌజ్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి దంపతులుగా నిలిచారు. కాగా ఈ ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మైఖేల్ ' సినిమాలో వరుణ్ కీలక పాత్రలో కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా షూటింగ్​లో హీరో వరుణ్​ సందేశ్​కు గాయాలు.. మూడు వారాల వరకు..

పెళ్లిపై వీజే సన్నీ క్వశ్చన్​.. స్టేజ్​పైనే వరుణ్​ సందేశ్​కు చెమటలు.. శేఖర్ మాస్టర్​ అయితే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.