Vijay Thalapahty Telugu Remake Movies : విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ ఉన్న హీరో విజయే. ఇళయదళపతిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆయనకు స్టార్ డమ్ రావడంలో తెలుగు రీమేక్ చిత్రాలు కీలకంగా వ్యవహరించాయని చాలా మంది అంటుంటారు. కోలీవుడ్‌లో తెలుగు రీమేక్ చిత్రాలు ఎక్కువ చేసిన హీరోల్లో విజయ్ ముందుంటారు. అందులో చాలా వరకు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. నేడు ఆయన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాలేంటో చూసేద్దాం.
పెళ్లి సందడి(నినైతేన్ వంధాయ్) - కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ క్లాసిక్ చిత్రం పెళ్లి సందడి. దీనిని నినైతేన్ వంధాయ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ఇందులో విజయ్ సరసన రంభ, దేవయాని నటించారు. కే సెల్వభారతీ దర్శకత్వం వహించారు. ఇది బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్‌ను అందుకుంది.
పవిత్ర బంధం(ప్రియమానవలె) - తెలుగులో సూపర్ హిట్ అందుకున్న పవిత్ర బంధం చిత్రాన్ని రిలీజైన నాలుగేళ్ల తర్వాత రీమేక్ చేశారు విజయ్. ప్రియమానవలెగా తెరకెక్కించిన ఈ చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. దీన్ని కూడా కే సెల్వభారతీ దర్శకత్వం వహించారు. ఇందులో సిమ్రాన్ హీరోయిన్‌గా నటించారు.
బద్రి (బద్రి) - పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బద్రి సినిమా ఎంతటి స్పెషలో తెలిసిన విషయమే. తమిళంలో కూడా ఇదే పేరుతో పూరీ జగన్నాథే దర్శకత్వం వహించారు. భూమిక, మోనాల్ హీరోయిన్లుగా నటించారు.
నీతో(సచిన్) - విజయ్‌ను తమిళ ప్రేక్షకులకు చాలా దగ్గర చేసిన సినిమాల్లో సచిన్ ఒకటి. ఈ సినిమాతో లవర్ బాయ్‌గా మారారు. నీతో అనే తెలుగు చిత్రానికి ఇది రీమేక్. కె.రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, మహేక్ చాహల్ హీరోహీరోయిన్లుగా డెబ్యూ చేసిన సినిమా ఇది. తమిళ రీమేక్‌లో దీనికి మంచి కలెక్షన్స్ వచ్చాయి.
చిరునవ్వుతో(యూత్) - త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన కథ చిరునవ్వుతో సినిమా చాలా మందికి ఎంతో ప్రత్యేకం. వేణు తొట్టెంపూడి, షాహీన్ జంటగా నటించారు. దీనిని యూత్ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు విజయ్. విన్సెంట్ సెల్వా దర్శకత్వం వహించారు.
నువ్వు నాకు నచ్చావ్(వసీగర) - వెంకటేశ్ ఎవర్గ్రీన్ హిట్ నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని వసీగర టైటిల్‌తో రీమేక్ చేశారు విజయ్. దీనికి కే సెల్వ భారీతనే దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సరసన స్నేహ హీరోయిన్‌గా నటించింది.
ఒక్కడు(గిల్లి) - మహేశ్ బాబు కెరీర్ టర్నింగ్ పాయింట్ ఒక్కడును తమిళంలో గిల్లి పేరుతో రీమేక్ చేశారు. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కలెక్షన్స్‌లోనూ దుమ్ము రేపిందీ చిత్రం. ఇక మహేశ్ పోకిరిని కూడా తమిళంలో పోకిరి పేరుతోనే రీమేక్ చేయగా భారీ స్థాయిలో సక్సెస్ సాధించింది.
అతనొక్కడే(ఆది) - కల్యాణ్ రామ్ కెరీర్‌లో మొదటి కమర్షియల్ సక్సెస్ సాధించిన చిత్రం అతనొక్కడే. తమిళంలో ఆది పేరుతో రీమేక్ చేశారు. రమణ దర్శకత్వంలో వహించారు. ఎస్ఏ చంద్రశేఖర్ నిర్మించారు. విజయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.
షారుక్ ఇంట్లో ఒక్క రోజు ఉండాలని ఉందా? - ఎంత కట్టాలంటే? - Shah Rukh Khans House