ETV Bharat / entertainment

విజయ్​ దేవరకొండ ట్రిపుల్ ధమాకా - ఎవరూ ఊహించని విధంగా 3 కొత్త సినిమాల అప్డేట్స్​ - Happy Birthday Vijay Devarkonda - HAPPY BIRTHDAY VIJAY DEVARKONDA

Happy Birthday Vijay Devarkonda New Movie : నేడు(మే 9) రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల లైనప్​ నుంచి వరుసగా అప్డేట్స్​ రిలీజ్ అవుతున్నాయి. వరుసగా మూడు కొత్త చిత్రాల నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి. ఇవి ఫ్యాన్స్​లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ETV Bharat

ETV Bharat
Vijay Devarkonda (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 1:22 PM IST

Happy Birthday Vijay Devarkonda New Movie : నేడు(మే 9) రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల లైనప్​ నుంచి వరుసగా అప్డేట్స్​ రిలీజ్ అవుతున్నాయి. వరుసగా మూడు కొత్త చిత్రాల నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ వచ్చాయి. ఇవి ఫ్యాన్స్​లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

యుద్ధం నాతోనే - విజయ్ దేవరకొండ రీసెంట్​గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఫ్యామిలీ స్టార్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్​లోనే ఇంకో సినిమాను చేయబోతున్నట్లు రీసెంట్​గానే అనౌన్స్ చేశారు. రూరల్​ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ కథకు సంబంధించి తాజాగా ఓ ఇంటెన్స్​ పోస్టర్​ను విడుదల చేశారు. కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే అంటూ రక్తంతో తడిచిన చేయి ఓ కత్తిని పట్టుకొని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే విజయ్ దేవరకొండ ఈసారి ఊర మాస్​గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో 59వ సినిమాగా ఇది రూపొందనుంది. రాజావారు రాణిగారు ఫేమ్​ దర్శకుడు రవి కిరణ్ కోలా దీనికి దర్శకత్వం వహించనున్నారు.

యోధుడిగా విజయ్ దేవరకొండ - మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​లోనూ విజయ్ ఓ సినిమా చేయబోతున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, రంగస్థలం, పుష్ప వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన ఈ బ్యానర్ నుంచే వచ్చాయి. త్వరలోనే మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మలినేనిల కాంబో, పుష్ప 2 సినిమాలు కూడా రానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయ్​ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. ఓ వీరుడి విగ్రమహం ఉన్న ఆసక్తికర పోస్టర్​ను కూడా రిలీజ్ చేసింది. శపించబడిన భూమి నుంచి వచ్చిన ఓ యోధుడి కథ అని రాసుకొచ్చింది.1854 సంవత్సరం నుంచి 1873 సంవత్సరం మధ్యలో జరిగిన కథ అని తెలిపింది. ఇతిహాసాలు రాయలేదు, అవి యోధుల రక్తంలో ఇమిడిపోయాయి అంటూ మరో క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దేవరకొండ ఓ యోధుడిలా కనిపించబోతున్నారని అర్థమవుతోంది.

బెస్ట్ ఔట్​ఫుట్​​ రిలీజ్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​లోనూ విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ కథతో రానుంది. దేవరకొండ బర్త్డే కావడంతో స్పెషల్ బర్త్​డే విషెస్ తెలుపుతూ ఓ స్పెషల్ లెటర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​. "రౌడీ ఫ్యాన్స్, తెలుగు ఆడియన్స్ మీ సహనాన్నిమేము అభినందిస్తున్నాము. లేట్ అయినా బెస్ట్ అప్డేట్ ఇస్తాము. వైజాగ్​లో మాసివ్ సీన్స్ షూటింగ్ చేస్తున్నాము. త్వరలో ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తాం." అని ప్రకటించారు.

టాలీవుడ్‌కు ఈరోజు ఎందుకంత స్పెషలో తెలుసా? - May 9th Release Movies

తండ్రి అడిగిన ఆ ఒక్క ప్రశ్న - రౌడీహీరోను సినిమాల్లోకి వెళ్లేలా చేసిందట! - Happy Birthday Vijay Devarkonda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.