Hanuman Overseas collections record: తేజా సజ్జా లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'. తక్కువ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ హనుమాన్ ఊహించని రేంజ్లో వసూళ్లు సాధిస్తోంది.ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది.
ఓవర్సీస్లో రూ.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసిన తెలుగు సినిమాల జాబితాలో చేరింది. ఇప్పటికే ఈ లిస్ట్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ (బాహుబలి, బాహుబలి-2, సాహో, సలార్), రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్) సినిమాలు ఉన్నాయి. అయితే ఈ 5 సినిమాలు కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలే. వీటి సరసన లో బడ్జెట్‌తో వచ్చిన హనుమాన్ స్థానం ఈ ఘనత సాధించడం విశేషం.
ఓవర్సీస్ లో రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాలు
- బాహుబలి ది బిగినింగ్ (2015)
- బాహుబలి-2 ది కంక్లూజన్ (2017)
- సాహో (2019)
- ఆర్ఆర్ఆర్ (2022)
- సలార్- 1 సీజ్ఫైర్ (2023)
-
50Cr+ Grossers Overseas Telugu Films #Baahubali1#Baahubali2 #Saaho
— Yaswanth (@Yaswanth4Prabha) January 25, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
RRR#Adipurush #Salaar #HanuMan****
RebelStar #Prabhas - 5
Teja sajja/RRR - 1
Rest - 0 pic.twitter.com/qYRj3utB8A
">50Cr+ Grossers Overseas Telugu Films #Baahubali1#Baahubali2 #Saaho
— Yaswanth (@Yaswanth4Prabha) January 25, 2024
RRR#Adipurush #Salaar #HanuMan****
RebelStar #Prabhas - 5
Teja sajja/RRR - 1
Rest - 0 pic.twitter.com/qYRj3utB8A50Cr+ Grossers Overseas Telugu Films #Baahubali1#Baahubali2 #Saaho
— Yaswanth (@Yaswanth4Prabha) January 25, 2024
RRR#Adipurush #Salaar #HanuMan****
RebelStar #Prabhas - 5
Teja sajja/RRR - 1
Rest - 0 pic.twitter.com/qYRj3utB8A
-
Jai Hanuman Movie: ఇక సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్ రానుంది. 'జై హనుమాన్' అనే టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. సినిమాను 2025లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Hanuman Movie Cast: హనుమాన్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జతోపాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్‌రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'హనుమాన్‌లో విభీషణుడి పాత్ర కీలకం - ఆయనే నా ఫస్ట్ ఛాయిస్'