ETV Bharat / entertainment

25 రోజుల్లో రూ. 300 కోట్లు - బాక్సాఫీస్ వద్ద మరో రేర్​ రికార్డు బ్రేక్​ - హనుమాన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్​

Hanuman Movie 25 Days Collection : సంక్రాంతి కానుకగా విడుదలై సెన్సేషన్ క్రియేట్​ చేస్తోంది 'హనుమాన్' మూవీ. తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను మేకర్స్ ప్రకటించారు.

Hanuman Movie 25 Days Collection
Hanuman Movie 25 Days Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 3:25 PM IST

Updated : Feb 6, 2024, 3:44 PM IST

Hanuman Movie 25 Days Collection : యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్​ ప్రశాంత్ వర్మ కాంబినేషన్​లో వచ్చిన 'హనుమాన్' ఇప్పటికీ బాక్సాఫీస్​ వద్ద పలు రికార్డులను బ్రేక్​ చేస్తూ దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లను సాధింస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్​ ఈ సినిమా 25 రోజుల కలెక్షన్ల గురించి అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఈ చిత్రం ఇప్పుడు రూ. 300 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన తొలి సినిమాగా 'హనుమాన్​' రికార్డుకెక్కింది.

ఈ విజయాన్ని ఆశ్వదిస్తున్న డైరెక్టర్​ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులను థ్యాంక్స్ చెప్పారు.

"హనుమాన్‌'ను ఆదరిస్తోన్న ఆడియెన్స్​కు థ్యాంక్స్​ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సినిమాకు ఎంతోమంది వారి హృదయాల్లో స్థానాన్ని కల్పించారు. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని చుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని ట్విట్ట్రర్​ వేదికగా ప్రశాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Hanuman Movie Cast : ఇక సినిమ విషయానికి వస్తే - ఈ సినిమాలో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించారు. 'వానా' మూవీ ఫేమ్​ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను తెరకెక్కించారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. ట్రైలర్​తో పాటు, సాంగ్స్​ కూడా ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్​ రానుంది. 'జై హనుమాన్‌' అనే టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి. ఈ మేరకు ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్​ గురించి మాట్లాడారు.

"హనుమాన్‌ కన్నా వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్‌' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ ఆయన హనుమంతు పాత్రలో కనిపిస్తారు. ఈ సీక్వెల్​ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రలో ఓ స్టార్‌ హీరో నటిస్తారు. 2025లో ఇది రిలీజ్ అవుతుంది. దీని కన్నా ముందు నా నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి 'అధీర'. మరొకటి 'మహాకాళి' అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హనుమాన్​ : ఒక్క రుధిరమణి కోసం వంద మణులు - అంజనాద్రి ఆర్ట్​ వర్క్​ విశేషాలివీ!

'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ!

Last Updated : Feb 6, 2024, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.