ETV Bharat / entertainment

'హనుమాన్​' డైరెక్టర్ సూపర్ ట్యాలెంట్​ - స్కూల్​ ఫంక్షన్​లో రివీల్ - Prasanth Varma

Hanuman Director Prasanth Varma : హనుమాన్ సినిమాతో సెన్సేషన్​ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తనలోని మరో ట్యాలెంట్​ను చూపించారు. ఇంతకీ అదేందంటే ?

Hanuman Director Prasanth Varma
Hanuman Director Prasanth Varma
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 5:52 PM IST

Updated : Feb 11, 2024, 6:52 PM IST

Hanuman Director Prasanth Varma : తన సినిమాలతో బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ క్రియేట్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. డిఫరెంట్​ కాన్సెప్ట్స్​తో చిత్రాలను తెరకెక్కించి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన తనలోని మరో ట్యాటెంట్​ను చూపించారు. తనలోని ఓ డైరెక్టరే కాదు ఓ మ్యూజీషియన్​ కూడా ఉన్నారని చూపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ప్రశాంత్​ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా తన చిన్నప్పటి స్కూల్​లో జరిగిన ఓ ఫంక్షన్​కు హాజరైన ప్రశాంత్​, అక్కడున్న స్టూడెంట్స్​తో ముచ్చటించారు. ఆ తర్వాత స్టేజీపై డ్రమ్స్ వాయించి తనలోని స్పెషల్ ట్యాలెంట్​ను రివీల్ చేశారు. దీంతో ఫంక్షన్​కు వచ్చినవారు ఆశ్యర్యపోయారు. ఇక ఈ వీడియోను ప్రశాంత్ సోషల్ మీడియాలో అప్​లోడ్​ చేశారు. దీంతో ఆయన పోస్ట్​పై కామెంట్ల వెల్లువ మెదలైంది. 'నీలో ఇంకెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయ్​ బ్రో' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Hanuman Movie Cast : ఇక సినిమ విషయానికి వస్తే - ఈ సినిమాలో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించారు. 'వానా' మూవీ ఫేమ్​ వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను తెరకెక్కించారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. ట్రైలర్​తో పాటు, సాంగ్స్​ కూడా ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి.

ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా విడుదలైన ఈ మూవీకి త్వరలో సీక్వెల్​ రానుంది. 'జై హనుమాన్‌' అనే టైటిల్​తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఇటీవల మొదలయ్యాయి. ఈ మేరకు ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్​ గురించి మాట్లాడారు.

"హనుమాన్‌ కన్నా వందరెట్లు భారీ స్థాయిలో 'జై హనుమాన్‌' ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. సీక్వెల్‌లోనూ ఆయన హనుమంతు పాత్రలో కనిపిస్తారు. ఈ సీక్వెల్​ సినిమా హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రలో ఓ స్టార్‌ హీరో నటిస్తారు. 2025లో ఇది రిలీజ్ అవుతుంది. దీని కన్నా ముందు నా నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి 'అధీర'. మరొకటి 'మహాకాళి' అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

'జై హనుమాన్​'లో చిరు - మహేశ్​ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ!

'హనుమాన్' సునామీ- 92 ఏళ్లలో ఆల్​టైమ్​ బ్లాక్​బస్టర్​గా రికార్డ్!

Last Updated : Feb 11, 2024, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.