Gunturu Karam Trivikram Mahesh Babu : భారీ అంచనాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన 'గుంటూరు కారం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఎందుకంటే ఎప్పుడూ తన సినిమాల్లో కథపై పూర్తి పట్టును ప్రదర్శిస్తూ స్ట్రాంగ్ ఎమోషన్స్, పదునైన మాటలతో మేజిక్ చేసే దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రంలో అలా చేయలేకపోయారు. దీంతో సినిమా రిజల్ట్ విషయంలో డివైడ్ టాక్ వచ్చింది. అయితే వాస్తవానికి 'గుంటూరు కారం' కోసం మొదటగా రాసుకున్న స్టోరీ ఇది కాదని తెలిసింది.
త్రివిక్రమ్ మహేశ్ బాబుతో కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయాలని అనుకున్నారట. దాన్నే అనౌన్స్ చేసిందట. కానీ కొద్ది రోజుల తర్వాత మహేశ్ బాబు మనసు మారిందని తెలిసింది. ఎందుకంటే ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో చేసేది కూడా యాక్షన్ మూవీనే అవ్వడం వల్ల మహేశ్ తన మనసును మార్చుకున్నారట. అందుకే యాక్షన్‌కు ముందు ఫ్యామిలీ ఎంటర్ టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని మాటల మాంత్రికుడితో చెప్పారట.
ఇక చేసేదేమి లేక త్రివిక్రమ్ తన స్టోరీని మార్చుకున్నారట. కానీ అప్పటికే సంక్రాంతి రిలీజ్ డేట్‌ను ప్రకటించేశారు. దీంతో మాటల మాంత్రికుడు త్వరత్వరగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త కథను సిద్ధం చేసి షూటింగ్‌ను పూర్తి చేశారు. గుంటూరు కారంగా థియేటర్లలోకి వదిలారు. అందుకే షూటింగ్ వాయిదాలు, టెక్నీషియన్స్ మారడాలు జరిగాయని తెలిసింది. అందుకే ఫైనల్‌గా 'గుంటూరు కారం' కొత్త కథ ఔట్ పుట్ సరిగ్గా రాలేదట.
మహేశ్ ముందుగా అనుకున్న కథను మార్చడంతో త్రివిక్రమ్ తనకు దొరికిన సమయంలో సరిగ్గా తీర్చిదిద్దలేకపోయారని అంటున్నారు. అయితే ఇదంతా అర్థం చేసుకున్న మహేశ్ - త్రివిక్రమ్ ఈ సారి అలా జరగకుండా మళ్లీ ముందుగా అనుకున్న ప్రకారమే యాక్షన్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట. మహేశ్ కూడా కచ్చితంగా మూవీ చేస్తానని త్రివిక్రమ్‌కు ప్రామిస్ చేశారని టాక్ వినిపిస్తోంది. కానీ ఇది రాజమౌళి మూవీ పూర్తయ్యాకే పట్టాలెక్కుతుందట. అంటే జక్కన్న సినిమాకు ఎలాగో రెండు, మూడేళ్లైనా పడుతుంది. కాబట్టి త్రివిక్రమ్ - మహేశ్ సినిమా రావాలంటే చాలా కాలామే పట్టొచ్చు!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'జై హనుమాన్'లో చిరు - మహేశ్ : అసలు విషయం చెప్పేసిన ప్రశాంత్ వర్మ!
ఎన్టీఆర్‌తో 'వార్ 2' షూటింగ్ - సూపర్ హింట్ ఇచ్చిన హృతిక్ రోషన్