ETV Bharat / entertainment

యాక్షన్​ మోడ్​లో గోపిచంద్, శ్రీనువైట్ల టైటిల్ గ్లింప్స్​ - అందర్నీ చంపేసి బిర్యానీ తింటూ - Gopichand SrinuVaitla Movie - GOPICHAND SRINUVAITLA MOVIE

Gopichand SrinuVaitla Movie : వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల - గోపీచంద్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విదేశాల్లో దీన్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. పక్కా యాక్షన్ మోడ్​లో సాగింది.

యాక్షన్​ మోడ్​లో గోపిచంద్, శ్రీనువైట్ల టైటిల్ గ్లింప్స్​ - అందర్నీ చంపేసి బిర్యానీ తింటూ

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 11, 2024, 4:45 PM IST

Updated : Apr 11, 2024, 5:28 PM IST

Gopichand SrinuVaitla Movie : వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల - గోపీచంద్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కావ్య థాపర్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విదేశాల్లో దీన్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. పక్కా యాక్షన్ మోడ్​లో సాగింది.

సాధారణంగా శ్రీను వైట్ల సినిమా అనగానే కామెడీ ఫుల్​గా ఉంటుంది. కానీ ఈ మధ్య శ్రీను వైట్ల కామెడీకి గిరాకీ తగ్గడంతో తన జానర్ మార్చుకుని యాక్షన్ వైపు వెళ్లారని ఈ టీజర్ చూస్తే అర్థం అవుతోంది.

ఈ ప్రచార చిత్రం మొదట్లో పశ్చిమ రాష్ట్రాల సంప్రదాయం కనిపిస్తుంది. అక్కడ వైభవంగా జరుగుతున్న ఒక పెళ్లి వేడుక ఆ వెంటనే అపరిచితుడు లాగా పెద్ద గిటార్​తో గోపి చంద్ ఎంట్రీ. టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ గోపి చంద్​లో మార్పు యాక్షన్ మోడ్​లోకి మారిపోయారు. గిటార్ బాక్స్​లో ఉన్న గన్​ను భుజం మీద దర్జాగా పెట్టుకుని ఆ పెళ్లి వేడుకలోకి వెళ్లి అందరిని చంపేస్తూ విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత అక్కడ వండిన బిర్యానీని తీసుకుని "ప్రతి గింజ మీద తినేవాడి పేరు ఉంటుంది దీని మీద నా పేరు ఉంది" అంటూ హిందీ డైలాగ్​తో టీజర్ ముగించారు. ఈ టీజర్​లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోపి చంద్ లుక్ డిఫరెంట్​గా ఉంది. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్​ సన్నివేశానికి తగ్గుట్టుగా సాగుతూ బాగుంది. టెక్నీకల్ స్టాండర్డ్స్​కు ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నామని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
కాగా, భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రం గోపి చంద్​తో పాటు శ్రీను వైట్ల కెరీర్​లో కూడా ఇదే పెద్దది. చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. టీజర్​లో హైలైట్ అయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​కు కారణం ఆర్​ఎక్స్ 100, ఎస్ ఆర్ కల్యాణమండపం వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్​ అందించిన చైతన్ భరద్వాజే దీనికి అందించడం. ఈ సినిమా విడుదల ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ముంబయి 'వార్'​లో దిగిన ఎన్టీఆర్​ - పది రోజులు అక్కడే! - War 2 Shooting

కమెడియన్​గా మారిన 'పుష్ప' షెకావత్ సార్ - Fahad fazil

Last Updated : Apr 11, 2024, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.