ETV Bharat / entertainment

సోషల్ మీడియాలో ప్రపంచ చెస్ ఛాంపియన్​కు విషెస్ వెల్లువ - చిరు, కమల్ ఏమన్నారంటే? - WORLD CHESS CHAMPION GUKESH

గుకేశ్​కు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు - సినీ ప్రముఖులు ఏమంటున్నారంటే?

Celebrities Congratulatest Gukesh
Celebrities Congratulatest Gukesh (ETV Bharat, Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2024, 10:09 AM IST

Celebrities Wishes To World Chess Champion Gukesh : ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్ గెలుచుకుని ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కాడు యువ కెరటం గుకేశ్​. గురువారం జరిగిన ఫైనల్​లో విజయం సొంతం చేసుకున్న ఈ 18 ఏళ్ల కుర్రాడికి నెట్టింట అభినందనల వెల్లువ మొదలైంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగా గుకేశ్​ను ప్రశంసిస్తున్నారు.

"వావ్‌ నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గుకేశ్‌ నువ్వు ఎంత అద్భుతంగా ఎత్తులు వేశావు. నేడు భారతదేశమంతా నిన్ను చూసి ఎంతగానో గర్విస్తోంది. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్‌ ఛాంపియన్​గా చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడు. అన్నింటికంటే ముఖ్యంగా చిన్న వయసులోనే చెస్‌ ఛాంపియన్‌గా మారావు. మేరా భారత్‌ మహాన్‌" - మెగాస్టార్ చిరంజీవి

"కంగ్రాజ్యూలేషన్స్ గుకేశ్‌. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్‌ ఛాంపియన్‌గా నువ్వు చరిత్ర సృష్టించావు. ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు. జైహింద్‌" - రాజమౌళి

"చరిత్రకు చెక్‌మేట్‌ పడింది. చెస్​లో ఓ కొత్త అధ్యయనాన్ని లిఖించినందుకు గుకేశ్‌కు అభినందనలు. భారత్​ ఎంతో గర్వంతో వెలిగిపోతోంది. ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థిపై ప్రశాంతంగానే అద్భుతంగా ఆడటం నీ ధైర్యాన్ని తెలియజేస్తోంది" - కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌ హాసన్‌

"గుకేశ్‌ నీకు నా గ్రాండ్‌ సెల్యూట్‌. నువ్వు ఓ అద్భుతం. నీ ప్రయాణంలో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను" - జూనియర్ ఎన్​టీఆర్

ఇదిలా ఉండగా, సినిమా స్టార్సే కాకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా గుకేశ్‌ను అభినందించారు. దేశం గర్వపడేలా చేశారంటూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ ట్వీట్​తో అతడికి శుభాకాంక్షలు తెలిపారు. గుకేశ్‌ అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయమని మోదీ పేర్కొన్నారు. చెస్ చరిత్రలో గుకేశ్‌ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షల మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ఈ గెలుపు ఎందరికో ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుందని అన్నారు. ఇక ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గెలవాలనేది తన కల అని గుకేశ్‌ ఆనందం వ్యక్తంచేశాడు. తనకు ప్రోత్సాహం అందించిన వారందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

చెస్‌ ప్రపంచ సింహాసనంపై తెలుగబ్బాయి! - 11 ఏళ్ల తర్వాత భారత్​కు టైటిల్ తెచ్చాడుగా!

'నా విజయంలో అతిపెద్ద కీలక పాత్ర ఆయనదే' - Fide Candidates 2024 Gukesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.