ETV Bharat / entertainment

బాక్సాఫీస్​కు రూ.500 కోట్లు తెచ్చిపెట్టిన తొలి సినిమా ఏదంటే ? - First Indian Movie With 500 Cr Mark

First Indian Movie Which Crossed Rs. 500 Crore Mark : భారతీయ సినీ చరిత్రలో ఎన్నో బ్లాక్​స్టర్ సినిమాలు వచ్చాయి. వసూళ్ల వర్షం కురిపించి సందడి చేశాయి. అయితే 2013లో ఓ సినిమా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల మార్క్ అందుకుంది. అంతేకాకుండా అప్పట్లోనే ఈ మైల్​స్టోన్ దాటిన తొలి సినిమాగా చరిత్రకెక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

FIRST INDIAN MOVIE WITH 500 CR MARK
FIRST INDIAN MOVIE WITH 500 CR MARK
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 1:07 PM IST

First Indian Movie Which Crossed Rs. 500 Crore Mark : సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. అందులో చిన్న స్థాయి నుంచి భారీ బడ్జెట్​ స్టోరీలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇప్పట్లో అయితే రూ. 100 కోట్ల మార్క్​ దాటడం ఎంతో ఈజీ. అయితే ఒకప్పట్లో అది సాహసమనే చెప్పాలి. ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుని వంద కోట్ల మార్క్ దాటిందంటే ఇక అంతే ఆ సినిమా రేంజే మారిపోతుంది. అయితే అదే కాలంలో ఓ సినిమా ఏకంగా రూ. 500 కోట్ల మార్క్ అందుకుని భారతీయ బాక్సాఫీస్​ వద్ద ఈ మైల్​స్టోన్​ దాటిన తొలి చిత్రంగా తెరకెక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ?

బాలీవుడ్ సినీ పరిశ్రమ మర్చిపోలేని సంవత్సరాల్లో 2013 కూడా ఒకటి. ఎందుకంటే ఆ ఏడాది ఇండస్ట్రీ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టింది. దీనికి తోడు హిందీ సినిమాకు 2013తో 100 ఏళ్లు పూర్తయ్యాయి. 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'క్రిష్-3', 'యే జవానీ హై దీవానీ'లతో పాటు 'ధూమ్-3' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలన్నీ ఆ ఏడాదే విడుదలయ్యాయి. ఇవన్ని సినిమాలు పాత్రలతో సహా ఇప్పటికీ మనకు గుర్తున్నాయంటే అప్పుడు ఏ రేంజ్ లో హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయితే 2013 సంవత్సరానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. బాక్సీఫీస్ కు రూ.500 కోట్లకు పైగా లాభాలు వచ్చిన సంవత్సరం కూడా అదే. అవును ఆ ఏడాదే అమీర్ ఖాన్ నటించిన 'ధూమ్-3' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్​కు చెందిన చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు ఇందులో నటించడంతో పాటు భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అప్పట్లోనే 'ధూమ్-3' సినిమా కోసం రూ. 100 నుంచి రూ. 175 కోట్ల వరకూ ఖర్చు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. హిందీ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలవడం విశేషం.

'ధూమ్-3' గురించి ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే
Dolby Atmos సరౌండ్ సౌండ్‌తో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదలైన మొదటి భారతీయ సినిమా కూడా ఇదే. బహుశా అందుకేనేమో రిలీజయిన పది రోజుల్లోనే దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ చిత్రం. తర్వాత రూ. 500 కోట్ల మార్క్​ను కూడా దాటేసి బాక్సీఫీస్ దద్దరిల్లేలా చేసింది.

విజయ్ కృష్ణ ఆచార్య, ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేసిన ఈ 'ధూమ్-3' సినిమా 2013న థియేటర్లలోకి వచ్చింది. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్​లు హీరో హీరోయిన్లుగా నటించగా, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్ లాంటి బాలీవుడ్ టాప్ అండ్ ఫేమస్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ధూమ్(2004), ధూమ్-2(2006)లకు సీక్వెల్​గా మూడవ భాగంగా 'ధూమ్-3'ని విడుదల చేశారు. ఈ మూడు చిత్రాలు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కించుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ నటీనటులను బాలీవుడ్ స్టార్స్ చేసిన రూ. 3 కోట్ల సినిమా

ఆ స్టార్​ హీరోతో సినిమా చేసేందుకు నో చెప్పిన రాజమౌళి! - ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.