ETV Bharat / entertainment

ఆ వ్యాధితో బాధ‌ప‌డుతున్న 'పుష్ప' విలన్ - అందుకే అలా అయిపోయారట! - Fahadh Faasil - FAHADH FAASIL

Fahadh Faasil ADHD Disease : మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ తాను ఓ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. పూర్తి వివరాలు స్టోరీలో

Source Getty Images
Fahadh Faasil (Source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 6:44 AM IST

Fahadh Faasil ADHD Disease : మలయాళ స్టార్ యాక్టర్​ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయనకు మంచి ఫేమ్ ఉంది. ఈ మధ్య మలయాళ సినిమాలు వరుసగా హిట్ అవుతున్న నేపథ్యంలో ఇంటర్వ్యూలు ఇస్తోన్న ఆయన తాజాగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు! తాను ఓ వ్యాధి బారిన పడినట్లు స్వ‌యంగా తెలిపారు. ఒక స్కూల్ ప్రారంభోత్స‌వానికి గెస్ట్​గా వెళ్లిన ఆయన ఈ విషయం గురించి ప్ర‌స్తావించారు. ఇంతకీ అస‌లు ఆ వ్యాధి ఏంటి? దాని ల‌క్ష‌ణాలు ఏంటి తెలుసుకుందాం.

ADHD వ్యాధి అంటే? - ADHD అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. 41 ఏళ్ల వ‌య‌సులో తాను ఈ వ్యాధి బారిన ప‌డిన‌ట్లు తెలిపారు ఫహాద్. ఒక విష‌యంపైన సరిగ్గా ఏకాగ్రత, ధ్యాస లేక‌పోవ‌డం, హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్ లాంటివి ఎక్కువ‌గా ఉండటం కనిపిస్తాయి. తామే క్రియేటివ్​గా ఉండాలి అనుకుంటారు. ఈ వ్యాధి ఉన్న‌ వార్లంతా సైక‌లాజిక‌ల్​గా ఎంతో ఒత్తిడిలో ఉంటూ, తీవ్ర ఇబ్బందుల‌కు గురౌతారని తెలిసింది.

చాలా మంది సెల‌బ్రిటీల‌కు - అయితే ఈ వ్యాధి కేవ‌లం ఫహాద్‌కు మాత్ర‌మే లేదు. చాలా మంది సెలబ్రిటీలు దీని బారిన పడ్డారు. ర్యాన్ గోస్లిన్, విల్ స్మిత్, జ‌స్టిన్ టింబ‌ర్ లేక్, జిమ్ కార్రీ, ఛానింగ్, బాలీవుడ్ దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఇమ్మా వాట్స‌న్ ఇలా చాలా మంది తాము ఈ సమస్యతో బాధపడినట్లు గతంలో స్వ‌యంగా చెప్పారు. కాగా, స‌మంత‌, పూన‌మ్ కౌర్, సోనాలీ బింద్రే లాంటి చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారే.

వరుస చిత్రాలతో బిజీ బిజీ - ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం వ‌రుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయ‌న రీసెంట్​గా న‌టించిన 'ఆవేశం' బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 'పుష్ప - 2' లో షూటింగ్​లోనూ పాల్గొన్నారు. బ‌న్వ‌ర్ సింగ్​గా మొదటి భాగంలో కాసేపే కనిపించి అలరించిన ఆయన ఇప్పుడు రెండో భాగంలో ఎక్కువ సేపు కీలక పాత్రలో కనిపించనున్నారు.

పెళ్లైన మూడు నెలలకే నటి విడాకులు! - Divya Agarwal Divorce

ఈ వారం 15 క్రేజీ సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.