Eagle Movie OTT: మాస్ మహారాజ రవితేజ- కార్తిక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ఈగల్ మూవీ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ అందుకుంది. ఫిబ్రవరి 9న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ డిసెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వర్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. మూవీలో యాక్షన్ సీన్స్, రవితేజ నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తయ్యింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ సోషల్ మీడియాలో అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కానీ, మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈటీవీగానీ, మేకర్స్‌గానీ వెల్లడించలేదు. అయితే ఏ సినిమానైనా థియేటర్లలో రిలీజైన 6- 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటుంది. ఈగల్ విషయంలోనూ అదే జరిగే ఛాన్స్ ఉంది. అంటే మార్చి మూడు లేదా నాలుగో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బూట్‌కట్ బాలరాజు అప్పట్నుంచే: బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బూట్‌కట్ బాలరాజు'. ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమాను పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శ్రీ కోనేటి నేచురల్‌గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా రిలీజై నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీలో అలరించడానికి సిద్ధమౌతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 'బూట్ కట్ బాలరాజు' ఆహాలో స్ట్రీమింగ్కానుంది. ఈమేరకు ఆహా ట్విట్టర్లో షేర్ చేసింది. 'మన బూట్ కట్ బాలరాజు ఇక ఊరు, వాడ, పిల్లా, జల్లా అందరూ రెడీగా ఉండుర్రి' అని పోస్టర్ షేర్ చేస్తూ, రాసుకొచ్చింది. అంటే రిలీజైన 24రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోని రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రవితేజ మాస్ కమ్‌బ్యాక్- నాన్ హాలీడేలోనూ అదిరే వసూళ్లు
నా సినిమా చూడడానికి ఎందుకు రావట్లేదు? - వెక్కి వెక్కి ఏడ్చిన సోహైల్