ETV Bharat / entertainment

రవితేజ మాస్ కమ్​బ్యాక్- నాన్ హాలీడేలోనూ అదిరే వసూళ్లు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 11:56 AM IST

Updated : Feb 10, 2024, 12:08 PM IST

Eagle Movie Day 1 collection: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ- కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన 'ఈగల్' మంచి రెస్పాన్స్ అందుకుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు ఎంత వసూల్ చేసిందంటే?

Eagle Movie Day 1 collection
Eagle Movie Day 1 collection

Eagle Movie Day 1 collection: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజై సూపర్ హిట్ టాక్ అందుకుంది. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో హీరో రవితేజను కార్తిక్ ఫుల్ ఆఫ్ యాక్షన్​ మోడ్​లో చూపించారు. ఇక నాన్ హాలీడేలో రిలీజైన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. రవితేజ గత రెండు సినిమాలతో పోలిస్తే ఈగల్ మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా తొలి ఎంత కలెక్షన్ చేసిందంటే?

ఇక శుక్రవారం ప్రీమియర్స్​ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫస్ట్, సెకండ్ షో ఆక్యుపెన్సీ పెరిగింది. కాకినాడలో అత్యధికంగా 64.50 శాతం, గుంటూరు లో 58.50 శాతం, విశాఖపట్టణంలో 50.75 శాతం, హైదరాబాద్​లో 46.25 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు తెలుస్తోంది. ఇక తొలిరోజు ఈగల్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.6.2 కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక రెండో రోజుకు దాదాపు లక్ష టికెట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ రావడం వల్ల ఈ వీకెండ్​లో బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజ్ సందడి కన్ఫార్మ్ అంటున్నారు.

'రావణాసుర', 'టైగల్ నాగేశ్వరరావు' సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. దీంతో రవితేజ ఈగల్​పై చాలా ఫోకస్ చేసి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్​కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ కార్తిక్ హీరో రవితేజను మునుపెన్నడూ లేని విధంగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుందని, అందులో చివరి 40 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు.

Eagle Movie Cast: ఈ సినిమాలో వినయ్ రాయ్, నవదీప్, అజయ్ ఘోశ్, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ మెహతా, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత పట్నాయక్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. దావ్​జన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఈగల్' ఫుల్ ఆఫ్ యాక్షన్ గ్లింప్స్​ ఔట్- రిలీజ్​కు ముందు బూస్ట్!

'ఈగల్' ట్విట్టర్ రివ్యూ- సక్సెస్ ట్రాక్​లోకి రవితేజ!- సినిమా టాక్ ఏంటంటే?

Last Updated : Feb 10, 2024, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.