ETV Bharat / entertainment

ఓవర్సీస్​లో దుల్కర్ మేనియా - రిలీజైన కొద్ది రోజుల్లోనే అక్కడి బాక్సాఫీస్ వద్ద రేర్​ రికార్డ్​!

'లక్కీ భాస్కర్' ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Dulquer Salmaan Lucky Bhaskar Movie
Dulquer Salmaan (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 1:06 PM IST

Dulquer Salmaan Lucky Bhaskar Movie : మాలీవుడ్ స్టార్​ హీరో దుల్కర్‌ సల్మాన్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కి బ్లాక్​బస్టర్​గా దూసుకెళ్తున్న లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్​తో పాటు కలెక్షన్లతోనూ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖతాలో వేసుకుంది. ఓవర్సీస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకుని రికార్డుకెక్కింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్​మెంట్ ద్వారా తెలియజేశారు. దీపావళికి బ్లాక్‌బాస్టర్‌ మూవీ 'లక్కీ భాస్కర్‌' అన్న క్యాప్షన్​ జోడించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

కథేంటంటే :
ముంబయి బ్యాక్​డ్రాప్​లో సాగే కథ ఇది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) సాధారణ బ్యాంక్ ఉద్యోగి. అంతంతమాత్రంగా వచ్చే జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా తనపైనే ఉండటం వల్ల బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వైపు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనే మరోవైపు కుటుంబాన్ని తనకు వచ్చే ఆ చాలీచాలని జీతంతోనే నెట్టుకొస్తుంటాడు. అయితే బెస్ట్ ఎంప్లాయి అనే పేరు తప్ప అతడికి ప్రమోషన్ మాత్రం రాదు. దీంతో ఎంత రిస్క్ చేసినా సరే తప్పు లేదని భావించి భాస్కర్ ఓ​ భారీ రిస్క్ చేస్తాడు. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? దీంతో అతడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? లేకుంటే ఆ కష్టాల్ని దూరం చేసుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

1980-90స్​లో బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. రెట్రో లుక్​లో దుల్కర్ అదరగొట్టగా, భాస్కర్‌ సతీమణి సుమతిగా స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయని సమాచారం. ఇక మిగతా నటీనటులు కూడా తమ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.

'రియల్​ లైఫ్​లోనూ నేను 'లక్కీ భాస్కర్'నే! - చిన్నప్పుడే అటువంటి కలలు కనేవాడిని'

'లక్కీ భాస్కర్' ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.