ETV Bharat / entertainment

ఈ పాట పాడింది దిల్​రాజునే అని మీకు తెలుసా? - Dil Raju Sing Song

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 4:39 PM IST

Dilraju Sing Song : నిర్మాత దిల్​రాజులో సింగింగ్ టాలెంట్​ ఉందని చాలా తక్కువ మందికే తెలిసే ఉంటుంది. సినిమాల్లోనూ ఓ పాట పాడారాయన. అదేంటో తెలుసా?

source ETV Bharat
Dilraju (source ETV Bharat)

Dilraju Sing Song : టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్​పై ఎన్నో హిట్​, ఫ్లాప్​ చిత్రాలను నిర్మించారు. అలానే కొత్త టాలెంట్​ను ప్రోత్సాహించడంలో ఆయన ముందుంటారు. నూతన దర్శకులను పరిచయం చేస్తుంటారు. మరి అలాంటి దిల్‌ రాజులోనూ ఓ స్పెషల్ టాలెంట్‌ ఉందని మీకు తెలుసా. అదే సింగింగ్‌. చాలా తక్కువ మందికి ఇది తెలిసి ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో, స్టేజ్​లపై ఆయన పాడుతూ కనిపిస్తుంటారు. కానీ సినిమాల్లోనూ ఆయన ఓ పాట పాడారట.

అవును మీరు చదివింది నిజం. అక్కినేని నట వారసుడు నాగచైతన్యను హీరోగా పరిచయం చేసింది దిల్​ రాజే. జోష్ చిత్రంతో ఇంట్రడ్యూజ్​ చేశారు. వాసు వర్మ దర్శకుడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. సరిగ్గా ఈ మూవీ రిలీజ్​ టైమ్​లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోవడం, దీంతో యావత్‌ రాష్ట్రం విషాదంలో మునిగిపోవడం జరిగిపోయింది. దీంతో రిలీజ్​ డేట్​లు వాయిదా పడి ఆలస్యమవడం, రాష్ట్రంలో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు కూడా సినిమాపై కాస్త ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

అయితే ఈ సినిమాలో మొదట హీరోగా రామ్‌చరణ్‌ను అనుకున్నారు దిల్‌రాజు. కానీ కుదరలేదు. తర్వాత నాగార్జున కథను వినడం, నాగచైతన్యను పరిచయం చేయడం జరిగిపోయాయి. సినిమాలో సందీప్‌ చౌతా అందించిన సంగీతం ఆకట్టుకుంది. పాటలు కూడా బాగున్నాయి. వీటిలోని ఓ పాటనే దిల్​రాజు పాడారు. 'అన్నయొచ్చినాడో వెలుగులు వెన్నెల్‌ తెచ్చినాడో' అనే పాటను దిల్​రాజు పాడారు. దీనికి చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. మొదట ఈ పాట లిరిక్స్‌ రాగానే అవి సరిగా ఉన్నయో లేదో అనుకుంటూ దిల్‌ రాజు హమ్‌ చేశారు. అది విన్న దర్శకుడు వాసువర్మ పట్టుబట్టి మరీ దిల్​రాజుతోనే పాట పాడించారు. ఈ విషయాన్ని గతంలో ఓసారి రాఘవేంద్రరావు సౌందర్య లహరిలో దిల్‌రాజు చెప్పారు.

కాగా, ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ను దిల్‌రాజు భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది.

రిచెస్ట్​ ప్లేస్​లో ప్రాపర్టీ కొన్న కృతిసనన్​ - ఎన్ని కోట్లో తెలిస్తే షాకే! - kriti sanon Alibaug

రామ్​చరణ్ కొత్త కారు చూశారా? - వామ్మో ఎన్ని కోట్లంటే? - Ramcharan New Car

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.