DJ Tillu Square Anupama Parameshwaran New Movie : టిల్లు స్క్వేర్తో ఫుల్ హాట్ బ్యూటీగా మారిపోయింది గ్లామర్ క్వీన్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. వాస్తవానికి ప్రేమమ్, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, శతమానం భవతి అంటూ మొదటి నుంచి ఎప్పుడూ పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ సినిమాతో కాస్త రూట్ మార్చింది. కానీ అప్పుడు లైట్ తీసుకున్న అభిమానులు ఇప్పుడు ఆమెను ఓ రేంజ్లో నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఆటాడేసుకుంటున్నారు. అయినా కూడా అనుపమ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. కుదిరినప్పుడు వాటికి వివరణ ఇస్తూ పోతోంది.
అయితే ఇంకా టిల్లు స్క్వేర్ సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అదిరిపోయే కలెక్షన్లను అందుకుంటూ దుసుకుపోతోంది. రూ.100 కోట్ల(DJ Tillu Square Collections) మార్క్‌కు వచ్చేసింది. ఈ చిత్రం ఇంకా లాంగ్ రన్ టైమ్‌ను పూర్తి చేసుకొనేలేదు అప్పుడే అనుపమ మలయాళంలో మరో సినిమాను సిద్ధం చేసేస్తుంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తాజా థ్రిల్లర్ చిత్రమే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ట్రూత్ షల్ ఆల్వేస్ ప్రివేల్ అనేది ఉపశీర్షిక. దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో జానకిగా అనుపమ కనిపించనుంది. లాయర్‌గా మలయాళ స్టార్ యాక్టర్ సురేశ్ గోపి నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ కూడా పూర్తైనట్లు అనుపమ తెలిపింది. దర్శకుడితో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. నా నెక్ట్స్ సినిమాకు డబ్బింగ్ పూర్తైంది అంటూ రాసుకొచ్చింది. కోర్టు రూమ్ డ్రామాగా ఇది రూపొందుతోంది. కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ మూవీ షూటింగ్ ముగిసింది.
ఇకపోత అనుపమ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటోంది.
'అతడి కోసమే ఆ పని చేశాను' - రష్మిక టాటూ వెనక సీక్రెట్ ఇదే! - Rashmika Mandanna Birthday