Vetrimaaran Thalapathy Vijay Movie : గోట్ చిత్రంతో ప్రస్తుతం బిజీగా ఉన్న విజయ్ దళపతి ఆ తర్వాత మరో సినిమా మాత్రమే చేయనున్నారు. అనంతరం పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండనున్నారు. ఈ క్రమంలోనే విజయ్ చివరి సినిమా కోసం ఇద్దరు దర్శకుల పేర్లు గట్టిగా వినిపించాయి. అవే హెచ్ వినోద్, వెట్రిమారన్. అయితే తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో వెట్రిమారన్ విజయ్‌తో సినిమా చేయబోయే విషయంపై స్పందించారు. "చాలా రోజుల క్రితం విజయ్‌కు నేనొక కథ చెప్పాను. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవచ్చు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు" అని రియాక్ట్ అయ్యారు.
వెట్రిమారన్ చివరిగా గతేడాది విడుతలై పార్ట్ 1తో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో వెట్రి మేకింగ్ స్టైల్, నటీనటుల ప్రదర్శన అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు బాగా వచ్చాయి. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కమెడియన్ సూరి పోలీస్ అధికారి పాత్ర పోషించగా విజయ్ సేతుపతి నక్సలైట్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పనుల్లో బిజీగా ఉంటున్నారు వెట్రిమారన్.
అలాగే ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) కోసం వర్క్ చేస్తున్న విజయ్ దళపతి ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. వెంకట్ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
గిల్లీ రీ రిలీజ్ - రీసెంట్గా విజయ్ హీరోగా ధరణి దర్శకత్వం వహించిన గిల్లీ చిత్రం రీరిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా రీరిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. తొలి రోజే రూ.10 కోట్లకు వరకు అందుకోవడం విశేషం. మహేశ్ ఒక్కడు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ సక్సెస్‌పై దర్శకుడు ధరణి ఆనందం వ్యక్తం చేశారు.
OTTలోకి వచ్చేస్తోన్న ఫహాద్ ఫాజిల్ రూ.100 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా - డోంట్ మిస్! - Avesham Movie
'మలయాళ సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వడానికి కారణమిదే' - Fahadh faasil