ETV Bharat / entertainment

సినీ ఇండస్ట్రీలో విషాదం- డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత - Director Surya Kiran Passed Away

Director Surya Kiran Passed Away : ప్రముఖ దర్శకుడు, రచయిత సూర్యకిరణ్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.

Director Surya Kiran Passed Away
Director Surya Kiran Passed Away
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 2:47 PM IST

Updated : Mar 11, 2024, 6:31 PM IST

Director Surya Kiran Passed Away : ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత సూర్యకిరణ్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. అయితే సూర్యకిరణ్​ మృతికి పచ్చ కామెర్ల వ్యాధే కారణమని తెలుస్తోంది. సూర్యకిరణ్​ మృతి పట్ల ఇటు తెలుగు చిత్రపరిశ్రమతో పాటు మిగతా సౌత్​ ఇండస్ట్రీస్​ పెద్దలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

నంది అవార్డులు సొంతం
తెలుగులో అక్కినేని నాగార్జున నిర్మాతగా, సుమంత్‌ హీరోగా నటించిన 'సత్యం'తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సూర్యకిరణ్​. ఈ మూవీ ఇద్దరి కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సూర్యకిరణ్‌ 'మాస్టర్‌' సురేశ్ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో చైల్డ్​ ఆర్టిస్ట్​గా యాక్ట్​ చేశారు. ఆ తర్వాత సహాయ నటుడిగానూ పలు సినిమాల్లో నటించారు. కొన్ని చిత్రాలకు రచయితగానూ పనిచేశారు. బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు సూర్యకిరణ్​.

రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులను కూడా దర్శకుడిగా రెండు సార్లు అందుకున్నారు. 'సత్యం' తర్వాత 'ధన 51', 'బ్రహ్మాస్త్రం, 'రాజు భాయ్‌', 'చాప్టర్‌-6', 'నీలిమలై' చిత్రాలకు దర్శకత్వం వహించారు సూర్యకిరణ్​. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4లోనూ కంటెస్టెంట్‌గా పోటీపడ్డారు. కానీ, మొదటి వారంలోనే హౌస్​ నుంచి ఎలిమినేట్​ అయ్యారు. ఇక కథానాయిక కల్యాణిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు.

సూర్యకిరణ్​ కెరీర్​ ఇలా
కేరళకు చెందిన సూర్యకిరణ్​ మలయాళ సినిమాలతో తన కెరీర్‌ని మొదలుపెట్టారు. తన నటనతో అక్కడి ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. 1978లో వచ్చిన 'స్నేహిక్కన్‌ ఓరు పెన్ను' చిత్రంతోనే సిల్వర్​ స్క్రీన్​పై అడుగుపెట్టారు. ఇలా మలయాళంలో మంచి సినిమాలు చేసుకుంటూ అటు కన్నడ, ఇటు తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చారు.

ఇక తెలుగులో మాత్రం 1986లో చిరంజీవి హీరోగా వచ్చిన 'రాక్షసుడు' సినిమాతో టాలీవుడ్​లో తన డెబ్యూ ఇచ్చారు. ఇలా 'దొంగమొగుడు', 'సంకీర్తన', 'ఖైదీ నెం.786', 'కొండవీటి దొంగ' లాంటి తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ మంచి క్రేజ్​ను క్రియేట్​ చేసుకున్నారు. మెగాస్టార్​తోనే కాకుండా సూపర్​స్టార్​ రజనీకాంత్​, కమల్​హాసన్​, అమితాబ్​ బచ్చన్​ వంటి బడా హీరోలతోనూ నటించారు సూర్యకిరణ్​.

ఓటీటీలో 'హనుమాన్‌'- ఈ వారం థియేటర్​లో చిన్న చిత్రాలదే హవా

ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటు నాటు'- టాలీవుడ్ రేంజ్​ అట్లుంటది మరి

Last Updated : Mar 11, 2024, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.