ETV Bharat / entertainment

జపాన్​లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు! - లేదంటేనా?

Director ss rajamouli son ss karthikeya Earthquake : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ జపాన్​లో తృటిలో ఓ ప్రమాధం నుంచి బయటపడ్డాడు. ఆ వివరాలు.

జపాన్​లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు - లేదంటేనా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 9:39 AM IST

Updated : Mar 21, 2024, 11:36 AM IST

Director ss rajamouli son ss karthikeya Earthquake : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు తన ఇమేజ్​ను పెంచుకుంటూ పాన్ ఇండియా డైరెక్టర్​గా ఎదిగారు. బాహుబాలికి ముందు టాలీవుడ్​కే పరిమితమైన జక్కన్న ఆ మూవీ రెండు పార్ట్​లు బ్లాక్ బస్టర్​గా నిలవడంతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆయనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. పాన్ వరల్డ్ డైరెక్టర్​గా రాజమౌళి ఎదిగారు. ఇప్పటికీ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా తగ్గడం లేదంటే ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ పెట్టిన తాజా పోస్టు ఫ్యాన్స్​ను కాస్త షాక్​కు గురిచేసింది. జపాన్​లో ఓ భూకంపం నుంచి తాను సేఫ్​గా బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. మొదటిసారి భూకంపం ఎక్స్​పీరియన్స్​ను చేశామని తెలిపాడు. "జపాన్​లో ఇప్పుడే భూకంపం ఎలా ఉంటుందో చూశాం. మేం 28వ అంతస్తులో ఉండగా బిల్డింగ్ మెల్లిగా కదలింది. ఆ తర్వాత ఇది భూకంపం అని అర్ధం అయింది. నేను చాలా భయపడ్డాను. కానీ చుట్టూ ఉన్న జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఏదో వర్షం పడటం మొదలవుతోంది అన్నట్టుగా క్యాజువల్​గా ఉన్నారు. మొత్తానికి భూకంపాన్ని ఎక్స్​పీరియెన్స్ చేశాం" అంటూ రాసుకొచ్చాడు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్​లో వచ్చిన వార్నింగ్ ఫొటో తీసి కార్తీకేయ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు రాజమౌళి ఆయన కుటుంబం సేఫ్​గా ఇండియాకు తిరిగి రావాలని కార్తీకేయ పోస్టులో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక జపాన్​లో వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. తూర్పు జపాన్ లోని దక్షిణ ఇబారకి ప్రిపెక్చర్​లో 46 మీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అక్కడి వాతావరణ సంస్థ తెలిపింది. కానీ ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం రాజమౌళి కుటుంబం జపాన్ పర్యటనలో ఉంది. మెగాపవర్ స్టార్ రామ్​చరణ్​, యంగ్ టైగర్ ఎన్టీఆర్​లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ కోసం వారంతా అక్కడికి వెళ్లారు.

SSMB 29 కోసం రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్​!

పాత్ర కోసం ప్రాణం పణంగా పెట్టిన స్టార్ హీరో - 72గంటల పాటు కేవలం నీళ్లనే తాగి

Last Updated : Mar 21, 2024, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.