ETV Bharat / entertainment

'దేవర- 2'లోనూ బాలీవుడ్‌ స్టార్స్‌- కొరటాల ప్లానింగ్ వేరే లెవెల్! - DEVARA 2 UPDATE

Devara 2 Update: 'దేవర-2' గురించి దర్శకుడు కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Devara 2 Cast
Devara 2 Cast (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2024, 12:58 PM IST

Devara 2 Cast Update: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ 'దేవర' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్ వైపునకు దూసుకెళ్తోంది. అయితే 'దేవర'కు సీక్వెల్ ఉందని డైరెక్టర్ కొరటాల శివ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో నటించే నటుల గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'రణ్​వీర్ లేదా రణ్​బీర్'
'దేవర పార్ట్-2' లో ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటుడిని చూడాలనుకుంటున్నారా? అని దర్శకుడు కొరటాల శివకు ప్రశ్నించగా, ఆయన సమాధానం ఇచ్చారు. 'నేను కచ్చితంగా చెప్పలేను. నిజానికి నా కోరికల జాబితాలో చాలా మందే ఉన్నారు. కానీ, నిజం చెప్పాలంటే రణ్​వీర్ సింగ్ లేదా రణ్​బీర్ కపూర్​ను 'దేవర' ప్రపంచంలో చూడాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఇది స్పాయిలర్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు. కానీ దీనిపై ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను' అని కొరటాల శివ వ్యాఖ్యానించారు.

శివ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇవి విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ 'దేవర- 2' నెక్ట్స్ లెవెల్​లో ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, 'దేవర' సీక్వెల్‌ ఊహించని విధంగా అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు రణ్​వీర్ లేదా రణ్​బీర్ ఎవరో ఒకరు 'దేవర-2'లో భాగమవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

సినిమా విషయానికొస్తే
ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించి అభిమానులను అలరించారు.

'దేవర'లో సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ సంగీతం అందించారు. యువసుధ, ఎన్టీఆర్ బ్యానర్లపై దేవర సినిమా తెరకెక్కింది. దేవర-1 భారీ హిట్ అవ్వడం వల్ల దాని సీక్వెల్ పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

'దేవర 2' విషయంలో కొరటాల శివ ప్రామిస్ - ' ఆ సీన్స్​ ఫ్యాన్స్​కు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి'

బాక్సాఫీస్ వద్ద 'దేవర' రోర్​ - ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందంటే? - Jr NTR Devara Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.