Dhanush Aishwarya Divorce : హీరో ధనుష్, దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో ధరఖాస్తు చేశారు. దాదాపు 18 ఏళ్లు పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడిపోయిన రెండేళ్ల తర్వాత విడాకుల కోసం తాజాగా కోర్టును ఆశ్రయించారు.
2004 నవంబర్ 18న ధనుష్, ఐశ్యర్య వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిప్రాయభేదాలు కారణంగా 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది.
సోషల్ మీడియా వేదికగా ప్రకటన
2022లో ధనుష్, ఐశ్వర్య ఒక లేఖ ద్వారా తాము విడిపోతున్నట్లు తెలిపారు. "18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని దయచేసి గౌరవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరం" అని ధనుష్ ట్విటర్‌లో ఉంచిన లేఖలో పేర్కొన్నారు. ఐశ్వర్య సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదే లేఖను పోస్టు చేశారు. ఆ లేఖకు ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం, ప్రేమ మాత్రమే కావాలని ఐశ్వర్య పేర్కొంది.
ఇక ధనుష్ సినిమా విషయాలకొస్తే ఈ ఏడాది 'కెప్టెన్ మిల్లర్' సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించారు. 'రాయన్' అనే థ్రిల్లర్ చిత్రంలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. దీంతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'కుబేర' చిత్రంలోనూ నటిస్తున్నారు. మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌గా తెరకెక్కనున్న 'ఇళయరాజా' సినిమాలో లీడ్ రోల్ చేయనున్నారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్య 'లాల్ సలామ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఫ్రిబవరిలోనే విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.
మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఏకగ్రీవం- కారణం ఏంటంటే? - Manchu Vishnu Maa President