Janhvi Kapoor Boyfriend Networth : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తలోనే నిలుస్తుంటారు. ప్రస్తుతం ఆమె శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసే కనిపించడం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు. రీసెంట్గా అత్యంత వైభవంగా జరిగిన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జాన్వీ కపూర్ తన రూమర్ ప్రియుడితోనే కలిసి పాల్గొన్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని అంతా అనుకుంటున్నారు.
పైగా జాన్వీ కపూర్ ఈ మధ్య ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లోనూ జాన్వీ శిఖర్ తనకు చాలా సన్నిహితుడనీ, ఇద్దరం కలిసే పెరిగామనీ అన్నారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా శిఖర్ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని, చాలా మంచి వ్యక్తనీ చెప్పుకొచ్చారు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం తప్పకుండా పెళ్లి వరకూ వెళుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఇంతకీ ఎవరీ శిఖర్ పహారియా? అతను ఏం చేస్తుంటాడు?, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతడి ఆదాయమెంత? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ పహారియా కొడుకే ఈ శిఖర్ పహారియా. బాంబే స్కాటిష్ స్కూల్, ధీరూబాయి అంబానీ ఇంటర్నేషన్ స్కూల్లో శిఖర్ స్కూలింగ్ పూర్తి చేశారు. తర్వాత లండర్ వెళ్లిన ఈ కుర్రాడు అక్కడ ఫేమస్ విశ్వవిద్యాలయమైన రీజెంట్ యూనివర్సిటీలో గ్లోబల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే శిఖర్ ప్రొఫెషనల్ పోలో ప్లేయర్. గుర్రపు స్వారీలో కూడా . అంతర్జాతీయ టోర్నీల్లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించాడు. వీటితో పాటు వివధ పర్యావణవేత్తలు, ఎన్జీవోలతో కలిసి పనిచేస్తుంటాడు శిఖర్. శిఖర్ పహారియాకు బలమైన రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్. తండ్రి వ్యాపారంలోకి వెళ్లినప్పటికీ శిఖర్ మేనత్త ప్రణితి షిండే కూడా రాజకీయాల్లో బాగానే రాణించి మహారాష్ట్రలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతనికి వీర్ పహారియా అనే సోదరుడు కూడా ఉన్నాడు. త్వరలోనే "స్కై ఫోర్స్" అనే చిత్రంతో వీర్ పహారియా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు.
శిఖర్ పహారియా ఆదాయం, ఆస్తి విషయానికొస్తే లండన్లోని ఒక అంతర్జాతీయ కంపెనీలో అతడు ఇన్వెస్ట్ మెంట్ అనలిస్ట్. ప్రస్తుతం అతడు తండ్రి సంజయ్ పహారియాతో కలిసి వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాడు. తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం శిఖర్ నికర విలువ రూ.84కోట్లు.
ఇకపోతే ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్(Devara, RC 16 Heroine) ప్రస్తుతం ఉలఝ్ విడుతల కోసం ఎదురుచూస్తోంది. తెలుగులో దేవర, ఆర్సీ 16సినిమాల్లో కనిపించనున్నారు.
కన్నడ భామతో విజయ్ దేవరకొండ రొమాన్స్ - న్యూస్ లీక్!
పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె కీలక నిర్ణయం! - ఫ్యాన్స్ ప్రశంసలు