ETV Bharat / entertainment

ఆ హాలీవుడ్ సినిమాలా 'దేవర' - గూస్​బంప్స్​ తెప్పించే అప్డేట్​ ఇచ్చిన అనిరుధ్​ - Devara Music Director Anirudh - DEVARA MUSIC DIRECTOR ANIRUDH

Devara Music Director Anirudh Ravichander : 'దేవర' రాకకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఇప్పటికే సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఉన్న ప్రేక్షకుల్లో మరింత జోష్ పెంచే వార్తను చెప్పారు సంగీత దర్శకుడు అనిరుధ్​. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Devara (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2024, 9:18 AM IST

Devara Music Director Anirudh Ravichander : 'దేవర' రాకకు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. దీంతో సినీ ప్రియుల్లో ఆసక్తి రెట్టింపు అయిపోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రమిది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్‌ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పి అంచనాలను మరింత రెట్టింపు చేశారు.

"బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చే సమయంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా చిత్రాన్ని ఎలా తీశారని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి చిత్రాలకు బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ అందించాలంటే మంచి ఎక్స్​పెరిమెంట్స్​ చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలని 95 శాతం రీరికార్డింగ్ పనులను ఫారెన్​లోనూ కంప్లీట్ చేశాం. దేవర చూస్తున్నప్పుడు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాల ఎక్స్​పీరియన్స్​ కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే దేవరలో మ్యూజిక్​కు ప్రత్యేక స్థానం ఉంది. ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం అన్నీ ఉంటాయి. థియేటర్​లో ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలని అనుకుంటున్నాను. కొరటాల శివ హైదరాబాద్‌లో ఏ థియేటర్‌కు తీసుకెళ్లినా నాకు ఇష్టమే. అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాను. మేము ఈ చిత్రాన్ని ఎంత ఎంజాయ్‌ చేశామో ఆడియెన్స్​ కూడా అంతే స్థాయిలో ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నాను." అని చెప్పారు.

Devara Cast : కాగా, ఈ చిత్రాన్ని ఆచార్య వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని దర్శకుడు కొరటాల శివ దీన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 27న పాన్‌ ఇండియా స్థాయిలో ఇది రిలీజ్ కానుంది. ఈ మూవీతోనే జాన్వీ కపూర్‌ టాలీవుడ్​కు పరిచయం కానుంది. ఎన్టీఆర్‌ డ్యుయెల్ రోల్ చేశారు. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. నందమూరి కల్యాణ్‌ రామ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

టాలీవుడ్ అప్​కమింగ్ బడా ప్రాజెక్ట్స్​ - ​ఈ స్టార్​ హీరోల సరసన సొగసరి వీరేనా? - Tollywood Upcoming Movies Heroines

'దేవర' మూవీ మెయిన్ థీమ్​ ఇదే - రెండో భాగం వచ్చేది అప్పుడే! : దర్శకుడు కొరటాల శివ - Devara Movie Theme

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.