ETV Bharat / entertainment

ఎన్​టీఆర్ బర్త్​డే - 'దేవర'తో పాటు ఆ రెండు చిత్రాల అప్​డేట్స్ కూడా! - Jr NTR Devara Movie - JR NTR DEVARA MOVIE

Devara Movie First Single : మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్​టీఆర్ బర్త్​డే రానుంది. ఈ నేపథ్యంలో అటు నెటిజన్లతో పాటు ఇటు తారక్ అభిమానుల కోసం పలువురు మేకర్స్ ఎగ్జైటింగ్ అప్​డేట్స్​తో రెడీగా ఉన్నారట. మరి అవేంటంటే ?

Devara Movie First Single
Devara Movie First Single (Source : ETV Bharat Archives)
author img

By ETV Bharat Telugu Team

Published : May 5, 2024, 9:51 AM IST

Devara Movie First Single : సాధారణంగా సినిమా హీరోల బర్త్​డేలు దగ్గర పడుతోందంటే అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఆ స్పెషల్​ రోజు కోసం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ సమయానికి పలు మేకర్స్ తమ హీరోల కొత్త సినిమా అప్​డేట్స్​ను నెట్టింట విడుదల చేస్తుంటారు. ఇక త్వరలో మ్యాన్ ఆఫ్ మాసెస్​ జూనియర్ ఎన్​టీఆర్ బర్త్​డే రానుంది. దీంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్​డేట్స్ వస్తాయని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఓ వైపు కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'దేవర' సినిమా షూటింగ్​తో పాటు 'వార్​ 2' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్​టీఆర్​. దీంతో ఈ రెండు సినిమాల టీమ్స్ కచ్చితంగా ఏదో ఒక అప్డేట్​ విడుదల చేస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమా గురించి ఓ రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్​ను రిలీజ్ చేసే పనుల్లో బిజీగా ఉందట చిత్రబృందం. దీంతో ఎన్​టీఆర్ బర్త్​డే స్పెషల్ అదేనేమో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక 'వార్-2' టీమ్​ కూడా తారక్ ఫ్యాన్స్​ను థ్రిల్​ చేసేందుకు సిద్ధమైందట. ఆ సినిమా షూట్ నుంచి ఒక మంచి యాక్షన్ లుక్​ను బర్త్​డే స్పెషల్​గా రిలీజ్ చేయనుందట.

మరోవైపు ప్రశాంత్ నీల్‌ - తారక్ కాంబోలో రానున్న సినిమా గురించి కూడా కీలక అప్​డేట్ రానుందని సమాచారం. అన్నీ సెట్ అయితే ఆ రోజు ఎన్​టీఆర్ ఫ్యాన్స్​కు హ్యాట్రిక్ ట్రీటే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక తారక్ అభిమానులు కూడా ఆ అప్​డేట్స్​ను ట్రెండ్ చేసేందుకు మేము ఎప్పుడో రెడీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక దేవర విషయానికి వస్తే, కాగా, సీ కాన్సెప్ట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా వస్తుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ఎన్టీఆర్ అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఎన్టీఆర్​ నా ఫ్రెండ్ కాదు - వాళ్లే నా స్నేహితులు' - Rajamouli NTR

'దేవర' రిలీజ్ ఆలస్యమైనా మీరందరూ కాలర్ ఎగరేస్తారు'- ఫ్యాన్స్​లో జోష్ నింపిన ఎన్టీఆర్ - Jr NTR Devara

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.