Devara Box Office Collections : జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. అదేంటంటే?
'దేవర' రిలీజై 18 రోజులు పూర్తవ్వగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రోజూ కోటి రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కొవిడ్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించిన సినిమాగా 'దేవర' రికార్డుకెక్కడం గమనార్హం. అలాగే సీడెడ్లోనూ రూ.30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు మాత్రమే అక్కడ ఈ స్థాయిలో కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన తీసిన చిత్రం కాకుండా మరో దర్శకుడి సినిమా ఈ స్థాయిలో వసూలు సాధించడం తొలిసారి కావడం విశేషం. దీంతో సీడెడ్ ఏరియాలో రూ.30 కోట్లు దాటిన రెండు సినిమాలు ఉన్న ఏకైక హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఆయన అభిమానులు ఈ వార్తను షేర్ చేస్తుండడంతో ‘దేవర’ హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
'దేవర' బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
ప్రీ సేల్స్ బుకింగ్స్‌లో పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్లో హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.510 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసినట్లు మూవీ టీమ్ తాజాగా తెలిపింది.
Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు. సీనియర్ నటుడు శ్రీకాంత్, మరాఠి స్టార్ శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ఈ చిత్రంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనిరుధ్ రవిచంద్రన్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచిందని అభిమానులు అంటున్నారు.
'దేవర- 2'లోనూ బాలీవుడ్ స్టార్స్- కొరటాల ప్లానింగ్ వేరే లెవెల్!