ETV Bharat / entertainment

'సెట్స్​లో నిద్రపోయేదాన్ని - అప్పట్లో నాకు చిన్న గది కూడా ఉండేది కాదు' - Deepika Padukone Latest Interview - DEEPIKA PADUKONE LATEST INTERVIEW

Deepika Padukone Latest Interview : పదిహేడేళ్ల వయసులో తన డ్రీమ్స్​ను వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయికి చేరుకున్న దీపిక పదుకుణె ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Deepika Padukone Latest Interview
Deepika Padukone Latest Interview
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 7:11 AM IST

Deepika Padukone Latest Interview : తన నటనతో అటు నార్త్​లోనే కాకుండా ఇటు సౌత్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె. జానర్ ఏదైనా సరే తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటిస్తుంటారు. ఆన్​స్క్రీన్​లోనే కాదు ఆఫ్​స్క్రీన్​లోనూ ఈమె వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నవయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్టార్​డమ్​ సంపాదించుకున్నారు. పదిహేడేళ్ల వయసులో తన డ్రీమ్స్​ను వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయికి చేరుకున్నారు దీపికా. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

"సినిమాలంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అంత చిన్న వయసులోనే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నానా? అని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఆ సమయంలో నేను మనసులో అనుకోగానే చాలా తేలిగ్గా ఇంట్లోంచి బయటికొచ్చేశాను. ఆ టైమ్​లో నాకు కనీసం చిన్న గది కూడా ఉండేది కాదు. తెలిసినవాళ్ల దగ్గరో, మోడలింగ్‌ చేసే షూటింగ్‌ స్పాట్‌లోనో ఉండేదాన్ని. రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తూనే ఉండేదాన్ని. డైరెక్టర్​ ఫరాఖాన్‌ దృష్టిలో పడి, 'ఓం శాంతి ఓం' సినిమాలో ఛాన్స్ వచ్చింది. నా కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి" అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక దీపిక ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ', 'సింగం అగైన్‌' అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

ఆ సినిమాలన్నీ వంద కోట్ల క్లబ్​వే
ఇప్పటి వరకు దీపికా కెరీర్​లో ఆమె కెరీర్​లో రూ.100 కోట్ల వసూలు చేసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. 'లవ్ ఆజ్ కల్' (రూ.117.27 కోట్లు), 'రేస్ 2' (రూ.162 కోట్లు), 'కాక్ టైల్' (121.78 కోట్లు),'యే జవానీ హై దివానీ' (రూ.318 కోట్లు), 'గోలియోం కీ రాస్​లీలా రామ్ లీలా' (రూ. 218.07 కోట్లు), 'చెన్నై ఎక్స్​ప్రెస్' (రూ.422 కోట్లు), 'పీకూ' (రూ.141.30 కోట్లు), 'హౌజ్ ఫుల్' (రూ.124.50 కోట్లు), 'పద్మావత్' (రూ.585 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (రూ.397 కోట్లు), 'బాజీరావ్ మస్తానీ' (రూ.184 కోట్లు), '83' (రూ.193 కోట్లు), 'ఫైటర్' (రూ.358 కోట్లు) ఇవే కాకుండా ఇటీవలే విడుదలైన 'పఠాన్', 'జవాన్' సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్​లోకి చేరిపోయాయి.

దీపికా పదుకొణె - 'కల్కి' కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

ప్రమోషనల్ ఈవెంట్స్​కు నో చెప్పిన దీపికా! - కారణం ఏంటంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.