Deepavali Speical Tollywood Release Movies : దసరా,దీపావళి లాంటి పెద్ద పండుగలను దృష్టిలో ఉంచుకుని రానున్న సీజన్లో పలు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఫెస్టివల్ స్పెషల్స్‌గా ఆయా చిత్రాలు థియేటర్లలోకి వచ్చేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అందులో 'దేవర', 'కంగువ'పై అభిమనుల్లో భారీ ఆశలే నెలకొన్నాయి. ఈ రెండూ కూడా భారీ తారాగణంతో రానున్న నేపథ్యంలోల బాక్సాఫీస్ వద్ద గటి పోటీ నెలకొననుంది.
అయితే అంతకంటే ముందే ఆగస్టు 15న 'సరిపోదా శనివారం' సినిమా తమ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. కానీ ఇదే తేదీన అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' రావాల్సి ఉండగా, అది కాస్త డిసంబర్కు వాయిదా పడింది. దీంతో '#35', 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'ఆయ్', లాంటి మీడియం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఇవన్నీ కూడా వేర్వేరు జానర్లలో రూపొంది మూవీ లవర్స్‌కు ఓ కొత్త అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వినాయాక చవితికి విజయ్ దళపతి 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' పోటీపడనున్నాయి.
ఇదిలా ఉండగా, వెలుగుల పండుగ దీపావళికి ఇంకా ఏటువంటి స్లాట్ బుక్ అవ్వలేదని అనుకునేలోపే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎంట్రీ ఇచ్చారు. తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోనున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా కన్ఫార్మ్ చేశారు. ఇప్పటి వరకూ ఈ ఒక్క సినిమానే దీపావళి రేసులో ఉంది. ఇది కూడా ఓ పెద్ద పండుగ అయినందున మరిన్ని సినిమాలు ఈ తేదీన రిలీజయ్యే అవకాశాలున్నాయని సినీ పండితుల మాట.
ఆ స్టార్ హీరోతో మరోసారి క్లాష్
ఇదిలా ఉండగా, సరిగ్గా అక్టోబర్ 31న శివకార్తికేయన్ 'అమరన్' మూవీ రిలీజ్‌కు సిద్ధం కానుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. పైగా బయోపిక్ కావడం వల్ల ఆడియెన్స్ ఈ చిత్రం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో టాలీవుడ్లో 'మెకానిక్ రాకీ'కి గట్టి పోటీనే నెలకొననుంది.
OTTలోకి 9 మంది స్టార్ హీరోలు కలిసి నటించిన సిరీస్!- స్ట్రీమింగ్ ఎందులో అంటే? - Manorathangal OTT