OTT Best Tamil Crime Thriller Movies : మీరు మూవీ లవరా? థ్రిల్లర్ కథలంటే ఇష్టమా? అయితే మీలాంటి వారి కోసమే క్రైమ్ థ్రిల్లర్, సైకో థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ అంటూ పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లను ఆయా ఓటీటీ సంస్థలు విరివిగా రిలీజ్ చేస్తున్నాయి. ఎందుకంటే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎన్నో ట్విస్ట్‌లతో ఉత్కంఠత రేకిస్తూ సాగుతుంటుంది. ముఖ్యంగా ఈ జానర్ సినిమాలకు తమిళ ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెడతాయి. మరి ఓటీటీలో దొరికే తమిళ బెస్ట్ థ్రిల్లర్స్‌పై ఓ లుక్కేద్దాం.
దట్టమైన అడవిలో డీ బ్లాక్(D Block Movie) : ఓ అడవి మధ్యలో ఉన్నయూనివర్సిటీలో డి బ్లాక్ సినిమా సాగుతుంటుంది. అయితే ఆ యూనివర్సిటీలోని డీ బ్లాక్‌లో ఎన్నో భయానక సంఘటనలు, నేరాలు జరుగుతుంటాయి. కానీ వాటిని మెనేజ్‌మెంట్ కప్పిపుచ్చుతూ డి బ్లాక్‌కు వెళ్లొద్దని హెచ్చరిస్తూ అడిషన్లు ఇస్తుంటుంది. కానీ, కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఆ డి బ్లాక్‌లోకి వెళ్తారు. మరి అప్పుడు అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయన్నదే మిగతా కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సీట్ ఎడ్జ్ కూర్చోపెట్టేలా సాగుతూ : తాను చేయని ఓ రాత్రి పూట జరిగిన మర్డర్‌లో ఇరుక్కుంటాడు ఓ ట్యాక్సీ డ్రైవర్. సినిమా మొత్తం అతడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఆడియెన్స్ సీట్ ఎడ్జ్ కూర్చొపెట్టేలా చివరి వరకు థ్రిల్లింగ్‌తో కథ సాగుతుంది. దర్శకుడు కథను ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించారు. ఆ చిత్రమే రేయికి వేయి కళ్లు. ఇది ఆహాలో అందుబాటులో ఉంది.
ఆ అమ్మాయిని ఎవరు చంపారు?(K 13 Movie) : కే 13 పేరుతో వచ్చిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కే 13. 2019లో విడుదలైన ఈ చిత్రాన్ని భరత్ నీలకంఠన్ తెరకెక్కించగా సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, అరుళ్ నిధి, అధిక్ రవిచంద్రన్, యోగిబాబు తదితరులు నటించారు. అయితే మదియ జగన్ అనే ఓ డిప్రెస్‌డ్ ఫిల్మ్ మేకర్ రోజు బార్‌కు వెళ్లి మందు కొడుతుంటాడు. అక్కడే ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి గదిలో కట్టేసి చనిపోయి ఉంటుంది. దీంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు మదియ చేసే ప్రయత్నమే కే 13. ఈ చిత్రం జియో సినిమా, సన్ ఎన్‌ఎక్స్‌టీలో అందుబాటులో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్(Diary Crime thriller Movie) : హారర్, సెంటిమెంట్, థ్రిల్లర్, క్రైమ్ ఇలా అన్ని జానర్స్ మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమా డైరీ. ఈ చిత్రం కూడా మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులోనూ అరుళ్ నిధి నటించారు. పవిత్ర మరిముత్తు, సెంథీ కుమారి ఇతర పాత్రలు పోషించారు. ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎమోషన్స్ అండ్ గ్రిప్పింగ్‌గా(Arathu Sinam thriller Movie) : సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ మెమోరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం ఆరతు సినమ్. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి ఎమోషన్స్ అండ్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ఇందులో అరుళ్ నిధి, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జియో సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులో ఉందీ చిత్రం. ఇంకా సన్ ఎన్‌ఎక్స్‌టీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌కు బాలయ్య జై - ప్రభాస్‌తో కలిసి రూ.100కోట్ల బడ్జెట్ మూవీలో!
రవితేజ ట్రిపుల్ ధమాకా - ఫ్యాన్స్ కోసం మూడు గుడ్ న్యూస్‌లు రెడీ!