Classic Sitcoms In OTT : ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎవరు అవునన్నా, కాదన్నా ఈ మాటలో నిజం లేకపోలేదు. అప్పట్లో వచ్చే సినిమాలు, టీవీ సీరియల్స్‌ని కుటుంబమంతా కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్లు. కొన్ని సీన్స్‌ని ఇప్పుడు గుర్తు చేసుకొన్నా పడీ, పడీ నవ్వుకుంటారు. సన్నివేశాల నుంచి క్రియేట్ అయ్యే కామెడీ అంత అద్భుతంగా ఉండేది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆ రోజులు ఏమైనా తిరిగొస్తాయాని అనుకుంటున్నారా? ఆ రోజులు రానక్కర్లేదు, ఆ టీవీ సీరియల్స్ వస్తే సరిపోదా? కాస్త సమయం కేటాయిస్తే, అవే మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లిపోతాయి.
90లు, 2000ల ప్రారంభంలో అందరినీ ఆకట్టుకున్న ఏడు ఫైవ్ టీవీ షోలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ టీవీ షోలు ఏంటి? ఏ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.
సారాభాయ్ Vs సారాభాయ్ (డిస్నీ+ హాట్‌స్టార్)
ఈ సీరియల్, డిన్నర్ టైమ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దక్షిణ ముంబయిలోని నాగరిక కఫ్ పరేడ్ పరిసరాల్లో నివసించే అప్పర్ క్లాస్ గుజరాతీ ఫ్యామిలీ అయిన సారాభాయ్‌ల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ కల్ట్ క్లాసిక్ షోలో అన్ని రకాల కుటుంబ పాత్రలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఆయా పాత్రల మధ్య క్రియేట్ అయ్యే కామెడీని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇందులో సతీష్ షా, రత్న పాఠక్ షా, సుమీత్ రాఘవన్, రూపాలి గంగూలీ, రాజేశ్ కుమార్ లాంటి బుల్లితెర స్టార్స్ నటించారు.
ఖిచ్డీ (డిస్నీ+ హాట్‌స్టార్)
పాత భవనంలో నివసించే గుజరాతీ కుటుంబంఅయిన పరేఖ్‌ల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. కుటుంబ సభ్యులందరి చమత్కారమైన వ్యక్తిత్వాలు ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ముఖ్యంగా ప్రఫుల్, హంసా ఒకరిని మించి మరొకరు కామెడీ పండిస్తారు. వీరితో పాటు అనంగ్ దేశాయ్, రాజీవ్ మెహతా, సుప్రియా పాఠక్, వందనా పాఠక్, జమ్నాదాస్ మజేథియా, రిచా భద్ర, యష్ మిట్టల్ లాంటి స్టార్స్ కూడా తమ పాత్రలతో ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు పూయిస్తారు.
హమ్ పాంచ్ (జీ5)
విద్యాబాలన్ సినిమాల్లో రాకముందు హమ్ పాంచ్‌లో తన నటనతో అందరినీ అలరించింది. ఈ షో ఒక తండ్రి, అతని ఐదుగురు సమస్యాత్మకమైన కుమార్తెల చుట్టూ తిరుగుతుంది. వారు ఎల్లప్పుడూ ఏదో రకంగా అల్లరి చేస్తూనే ఉంటారు. తండ్రి అతని రెండో భార్య, చనిపోయి ఫొటోకి పరిమితమైన మొదటి భార్య సహాయం తీసుకుంటాడు. అవును మొదటి భార్య ఫోటో నుంచి ఆయనతో మాట్లాడుతుంది. ఈ ఫో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. ఇందులో అశోక్ సరాఫ్, విద్యాబాలన్, రాఖీ టాండన్, భైరవి రాయచూర, వందనా పాఠక్ నటించారు.
ఫ్యామిలీ నెం.1 (సోనీ లివ్ , జీ 5)
ఒక బీచ్ హౌస్‌లో నివసిస్తున్న రెండు కుటుంబాల చుట్టూ ఈ సీరియల్ తిరుగుతుంది. ఒకరు విడాకులు తీసుకున్న వ్యక్తి, అతనికి ముగ్గురు పిల్లలు. మరొకరు విడాకులు తీసుకున్న మహిళ, ఆమెకు ముగ్గురు పిల్లలు. రెండు కుటుంబాలు నిరంతరం గొడవలు పడుతుంటే, మీరు మాత్రం అది చూసి తెగ నవ్వుకుంటారు. ఇందులో కన్వాల్‌జీత్ సింగ్, తన్వీ అజ్మీ, కబీర్ సదానంద్, అపర్ణ తిలక్, విశాల్ సోలంకి, ఉమేష్ ఫెర్వానీ, అజయ్ నగ్రత్, నియతి రాజ్‌వాడే నటించారు.
బా బహూ ఔర్ బేబీ (డిస్నీ+ హాట్‌స్టార్)
'బా బహూ ఔర్ బేబీ' కూడా ఉమ్మడి గుజరాతీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కానీ ఇందులో కామెడీతో పాటు సీరియస్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. సమస్యలు తలెత్తుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటారు. కుటుంబ పెద్ద బా, ఆమె పిల్లలు గట్టు, బేబీ మధ్య రిలేషన్ మీకు ఎప్పటికీ మనసులో నిలిచిపోతుంది. ఇందులో సరితా జోషి, అరవింద్ వైద్య, బెనాఫ్ దాదాచంద్జీ, దేవెన్ భోజానీ, రాజీవ్ మెహతా, లుబ్నా సలీం, పరేష్ గణత్రా, వైశాలి థక్కర్ నటించారు.
వీకెండ్ స్పెషల్ - టాప్ 10 ట్రెండింగ్ సిరీస్ ఇవే! మీరేం చూస్తారు? - Top 10 OTT Webseries