ETV Bharat / entertainment

'విశ్వంభర'లో మరో స్టార్ హీరోయిన్!- ఇదిగో క్లారిటీ!

'విశ్వంభర' సినిమా కోసం మరో స్టార్ హీరోయిన్ - క్లారిటీ వచ్చేసిందిగా!

Chiranjeevi Vishwambhara Movie
Chiranjeevi Vishwambhara Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Chiranjeevi Vishwambhara Movie : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న విశ్వంభర మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం ఉండగా, తాజాగా ఈ లిస్ట్​లోకి మరో స్టార్ హీరోయిన్ పేరు చేరిందని సినీ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే ఆ విషయంలో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆ హీరోయినే క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరంటే?

'ఈ రూమర్స్ గురించి నాకు తెలియదు'
'విశ్వంభర' సినిమాలో ఇప్పటికే త్రిషతో పాటు యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరితో పాటు మీనాక్షి చౌదరీ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ అటు మీనాక్షి కానీ ఇటు మూవీ టీమ్ కానీ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇవి నిజమని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మీనాక్షి ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్​కు చెక్ పెట్టింది. తనకు తెలియకుండానే ఈ వార్తలు ఎందుకు చక్కర్లు కొడుతున్నాయో అర్థం కావట్లేదని పేర్కొంది. ఏదైనా సినిమాలో నటిస్తే తానే స్వయంగా అనౌన్స్ చేస్తానని క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇక 'విశ్వంభర' విషయానికి వస్తే, 'విశ్వంభర' సినిమా విషయానికొస్తే - సీనియర్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ కలిసి నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్​లో 'విశ్వంభర' తెరకెక్కుతోంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' తర్వాత చిరు నుంచి ఈ జానర్​లో వస్తున్న సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి.

దసరా ట్రీట్​​ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్​ టీజర్​

'విశ్వంభర' వాయిదాకు కారణం అదే- గేమ్​ఛేంజర్ కాదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.