ETV Bharat / entertainment

చిరు ఇంట సంగీత కచేరీ - 'విశ్వంభర' టీమ్​ నుంచి ఆ స్పెషల్ పర్సన్​కు సర్​ప్రైజ్​! - Chiranjeevi Vishwambara - CHIRANJEEVI VISHWAMBARA

Chiranjeevi Vishwambara : మెగాస్టార్ చిరంజీవీ తాజాగా విశ్వంభర మూవీకి సంబంధించిన సూపర్ అప్డేట్​ను ఫ్యాన్స్​తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ పర్సన్​కు బర్త్​డే విష్ చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

Chiranjeevi Vishwambara
Chiranjeevi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 4, 2024, 10:09 AM IST

Chiranjeevi Vishwambara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సెట్స్​లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు కీలక షెడ్యూల్స్​ ముగించుకుని చిత్రీకరణ జరుపుకుంటుండగా, చిరు తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి అందరికీ సర్​ప్రైజ్ ఇచ్చారు. తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ పేర్కొన్నారు. కీరవాణీ బర్త్​డే స్పెషల్ అంటూ ఆయనకు విషెస్ చెప్తూ ఈ వీడియోను షేర్ చేశారు.

"గతంలో సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల గురించి చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. విశ్వంభర సినిమాతో మళ్ళీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు. మా ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీమ్​తో కలిసి విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు." అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్​లో చిరుతో పాటు డైరెక్టర్ వశిష్ఠ, మిగతా మూవీటీమ్​ పాల్గొని సందడి చేశారు.

ఇక చిరు కూడా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. పాత రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే ఈ వీడియోలో చిరు సూపర్​హిట్​ మూవీ 'ఆపద్భాంధవుడు'లోని 'చుక్కలారా చూపుల్లారా' అంటూ సాంగ్​ను కీరవాణి అక్కడే కంపోజ్ చేస్తూ పాడారు. చిరుతో పాటు మూవీ టీమ్​ మొత్తం ఆ పాటను వింటూ ఆస్వాదించారు.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే సోషియో ఫాంటసీ బ్యాక్​డ్రాప్​తో ఈ సినిమా భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది. 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. త్రిష, అశికా రంగనాథ్, ఇషా, సురభి లాంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియో కూడా ప్రేక్షకులను సినిమాపై మరిన్నీ అంచనాలు పెంచేసేంది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది.

Chiranjeevi Socio Fantasy Movies : ఇక చిరు ఈ తరహా జానర్​ సినిమాల్లో నటించడం ఇదేం తొలిసారి కాదు. ఆయన ఇది వరకే 'జగదేక వీరుడు అతిలోక సుందరి','అంజి' లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాతో తనను మరింత కొత్తగా చూపించేందుకు మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

'విశ్వంభర' కోసం డేరింగ్ స్టంట్!- చిరు డెడికేషన్​కు హ్యాట్సాఫ్​! - Vishwambhara Chiranjeevi

'విశ్వంభర' సెట్స్​లో మరో స్టార్ హీరో - పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న చిరు - Viswambhara Chiranjeevi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.