Chiranjeevi Mohan Babu : మెగా ఫ్యామిలీ - మంచు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు చాలా సార్లు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లో మా ఎలెక్షన్స్ సమయంలో బాగా ఎక్కువగా వినిపించింది. అయితే దీనిపై తాజాగా మంచు మనోజ్ స్పందించారు. చిరంజీవి - మోహన్ బాబు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని అన్నారు. రామ్ చరణ్ తన ప్రాణ మిత్రుడని చెప్పారు. చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో వేడుకలు (Ram Charan Birthday Celebrations) గ్రాండ్‌గా జరిగాయి. అలా ఓ ఈవెంట్‌కు మనోజ్‌తో పాటు హీరోలు కిరణ్ అబ్బవరం, నిఖిల్, దర్శకులు బుచ్చిబాబు, బాబీ తదితరులు గెస్ట్లుగా వెళ్లి సందడి చేశారు.
"చరణ్ ఎంతో గొప్ప నటుడు. అంతే గొప్ప మనిషి కూడా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తట్టుకోలేడు. వెంటనే సాయం చేస్తాడు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఓ తెలుగు కుటుంబం దుబాయ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిసింది. అప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఈ విషయం రామ్ చరణ్‌కు ఫోన్ చేసి చెప్పాను. నా వంతు సాయం చేశాను ఇంకా రూ. ఐదు లక్షలు తక్కువయ్యాయి అని అన్నాను. తక్షణమే డబ్బు పంపాడు. ఆ ఫ్యామిలీకి ఆశీస్సులు చరణ్‌కు ఎప్పుడూ ఉంటాయి. అతను స్నేహానికీ వ్యాల్యూ ఇస్తాడు. చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాడు" అని మనోజ్ చెప్పుకొచ్చారు.
"కొంతమంది మీ నాన్న, రామ్ చరణ్ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు కదా. మీరెలా కలిసి ఉంటున్నారురా? అని అడిగారు. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకుంటే ఆ వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని తిరిగి నేను ప్రశ్నించాను. వాళ్లిద్దరు టామ్ అండ్ జెర్రీలాగా ఉంటారు. దాదాపు 45 ఏళ్ల అనుబంధం వారిద్దరది. మాలాగే ఆ ఇద్దరు కూడా ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని మనోజ్ అన్నారు. పెదరాయుడు చిత్రంలోని పాపులర్ డైలాగ్‌ను రీక్రియేట్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఎ రిలేషన్ బెట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్‌బీ లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్. బట్ షుడ్ నాట్ బీ లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్‌మ్యాన్ అంటూ కూడా చెప్పారు. దీంతో ఫ్యాన్స్ కేరంతలతో హోరెత్తించారు.
సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ - హర్ట్ అయిన అనుపమ! - Tillu Square Anupama Parameshwaran