Chiranjeevi Jim Video : మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులకు కన్నుల పండగే. గత ఏడాది 'వాల్తేరు వీరయ్య' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత భోళా శంకర్ సినిమాతో వచ్చి పరాజయాన్ని చూశారు. ఈ సినిమా రిజల్ట్‌తో బాగా ఆలోచించి సోషియో ఫాంటసీ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారు. అలా ప్రస్తుతం తన 156వ సినిమాగా 'విశ్వంభర' (Vishwambhara Movie) చేస్తున్న సంగతి తెలిసిందే.
బింబిసార డైరెక్టర్ వశిష్టతో దర్శకత్వంలో రూపొందుతోంది. బియాండ్ యూనివర్స్ అంటూ కొత్త కథతో రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా మెగాస్టార్(Megastar) తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. 'విశ్వంభర' కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్‌లో చెమటోడుస్తున్న వీడియోను షేర్ చేశారు. జిమ్‌లో అన్ని రకాల కసరత్తులు చేస్తూ కనిపించారు. 68 ఏళ్ల వయసులో చిరు జిమ్‌లో ఈ రేంజ్లో కష్టపడటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారనే విషయం తెలిసిందే. సినిమా కోసం 100 శాతం ఎఫెర్ట్స్ పెడతారు. ఎంతైనా కష్టపడతారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడు 'విశ్వంభర' మూవీ కోసం ఆయన ఈ రేంజ్లో కష్టపడటం చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బాసూ నువ్వు ఎప్పటికే గ్రేటే అని ప్రశంసిస్తున్నారు.
విశ్వంభర షూటింగ్ విషయానికొస్తే - ఇప్పటికే రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించుకుంది. కానీ చిరు ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. త్వరలోనే కొత్త షెడ్యూల్‌తో సెట్స్‌లోకి రానున్నారని సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను మూవీటీమ్ సిద్ధం చేస్తోందట. అందులో చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలిసింది. సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఆయనకు జోడీగా ముగ్గురు నాయికలు ఉంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సంగీతం: ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు.
హీరోగా ఎంట్రీగా ఇవ్వనున్న బిగ్ బాస్-7 ఫేమ్ అమర్దీప్- హీరోయిన్ ఎవరంటే?
'ప్రతి పనిలో అతని సహకారం, సలహాలను తీసుకుంటా'- రష్మిక కీలక వ్యాఖ్యలు