ETV Bharat / entertainment

ఫ్యాన్స్ గెట్‌ రెడీ - ఒకే వేదికపై బాలయ్య, చిరు! - Chiranjeevi Balakrishna - CHIRANJEEVI BALAKRISHNA

Chiranjeevi Balakrishna : చిరంజీవి, బాలకృష్ణ కలిసి ఒకే స్టేజ్‌ పంచుకోనున్నారని తెలిసింది. ఇంతకీ ఎందుకు, ఎక్కడంటే?

source ETV Bharat
Balakrishna Chiranjeevi (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 3:19 PM IST

Chiranjeevi Balakrishna Unstoppable : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ గురించి తెలిసిందే. ఇప్పటికే విశేష ఆదరణతో మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు కొత్త సీజన్‌ కోసం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ షో ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలిసింది.

అయితే ఈ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, డైరెక్టర్స్‌, ఇతర సెలబ్రిటీలతో సందడి చేసిన ఈ షో ఇప్పుడు మరింత ఫుల్‌ జోష్‌తో సాగేలా మేకర్స్‌ ప్లాన్ చేశారట. అందులో భాగంగానే ఈసారి చీఫ్‌ గెస్ట్‌గా టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి రాబోతున్నారని సమాచారం అందింది. వాస్తవానికి ఈ ప్రచారం ప్రతీ సీజన్‌లోనూ సాగింది. కానీ అది కుదరలేదు.

అయితే ఈ సారి మాత్రం అలా కాకుండా అది కార్యరూపం దాల్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి. చిరు పుట్టిన రోజు సందర్భంగా దీనికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా చెబుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ సారి ఏం జరుగుతుందో.

అసలే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణలకు ప్రత్యేక స్థానం ఉంది. మాస్‌ హీరోలుగా మస్త్ క్రేజ్‌ ఉంది. అయితే వీరిద్దరు కలిసి ఒకే స్టేజ్‌పై కనిపిస్తే చూడాలని వేలాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్థలు ఉన్నాయంటూ కూడా కొన్ని సార్లు ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత అవన్నీ పుకార్లే అని కూడా వార్తలు వచ్చాయి. ఏదేమైనా చిరు - బాలయ్య కలిసి ఒకే వేదికపై కనిపిస్తే, ఫ్యాన్స్‌కు అంతకుమించిన ఎంటర్‌టైన్మెంట్‌ ఏముంటుంది.

Nagarjuna Balakrishna Unstoppable : ఇకపోతే మరో విషయమేమిటంటే కేవలం చిరంజీవినే కాదు టాలీవుడ్ మన్మథుడు, కింగ్‌ నాగార్జున కూడా ఈ సారి పాల్గొంటారని సమాచారం. వీటన్నింటితో పాటు, మరికొన్ని సర్‌ప్రైజ్‌ కూడా ఉంటాయని సమాచారం. దీనిపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నాగచైతన్య- శోభిత పెళ్లి ఎప్పుడు? నాగార్జున రిప్లై ఇదే! - Naga Chaitanya Sobhita

మొదటి భార్యకు విడాకులు ఇచ్చి - మళ్లీ ప్రేమలో పడ్డ హీరోలు వీరే! - Nagachaitanya Sobhitha Dhulipala

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.