Celebrities Educational Background : సినీపరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో రోజుకో హీరో, హీరోయిన్ పరిచయం అవుతుంటారు. అయితే చిత్రపరిశ్రమలో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. కావాల్సినంత టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే. ఇవి ఉంటేనే వెండితెరపై ఆయా స్టార్స్ తమ ప్రతిభను చాటుకుంటారు.
ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు రాణిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఉన్నత విద్య అభ్యసించి, సినిమా మీదున్న మక్కువతో గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుపెట్టినవారు కూడా ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం క్రేజీ స్టార్లుగా కొనసాగుతున్న కొంత మంది హీరో హీరోయిన్ల విద్యార్హతల గురించి తెలుసుకుందాం.
మృణాల్ ఠాకూర్ :
మృణాల్ ఠాకూర్ బీడీఎస్ కోసం ఎంట్రన్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. కానీ చివరికి బ్యాచిలర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్‌లో చేరారు. అప్పుడే మోడలింగ్ ఛాన్స్ రావడం వల్ల దాంతో పాటు ఓ సంస్థలో ఇంటర్నిషిప్ కూడా చేశారట. ఎప్పటికైనా పేరున్న సంస్థలో జాబ్ చేయడం ఆమె డ్రీమ్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
శ్రీలీల :
మెడిసిన్ చదువుతూనే ఈ చిన్నది సినిమాల్లోకి వచ్చారు. డాక్టర్ కావాలన్న కోరికతో ప్రస్తుతం సినిమాలతో పాటు చదువు కూడా కొనసాగిస్తున్నారు.
పరిణీతి చోప్రా :
లండన్‌లోని మాన్చెస్టర్ బిజినెస్ స్కూల్లో ట్రిపుల్ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లో యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండటం వల్ల స్టడీస్‌తో పాటు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. చదువు పూర్తయ్యాక ఓ మార్కెటింగ్ సంస్థలో పనిచేసి,కొంత కాలానికి సినిమాల్లోకి వచ్చారు.
సమంత :
చెన్నైలోని స్టెల్లా మేరిస్ కళాశాలలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు సామ్. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ముగిసే సమయానికి మోడలింగ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలోనే 2010లో ఏమాయ చేసావే సినిమాల్లో నటించింది.
త్రిష :
చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ చేశారు.
రష్మిక మందన్న :
బెంగళూరులోని ఎంఎస్ రామయ్య కాలేజీ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో రష్మిక బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. మైసూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో ప్రీ-యూనివర్సిటీ కోర్సు చేశారు.
సాయిపల్లవి :
సినిమాల్లో నటిస్తూనే డాక్టర్ కోర్సు పూర్తి చేశారు. అమెరికాలోని జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీని పూర్తి చేశారు.
అనుష్కశెట్టి :
బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశారు.
కాజల్ అగర్వాల్:
మాస్ మీడియాలో డిగ్రీ, మార్కెటింగ్ అడ్వర్టైజింగ్‌లో స్పెషలైజేషన్‌తో పట్టభద్రురాలయ్యారు.
పూజా హెగ్డే:
ముంబయిలోని ఎంఎంకే కాలేజ్ (శ్రీమతి మితిబాయి మోతిరామ్ కుందనాని కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్)లో బీకామ్ డిగ్రీ కోర్స్ పూర్తి చేశారు.
నిత్యా మేనన్:
మణిపాల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీ అందుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్:
ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీ యూనివర్సిటీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో చదివారు.
నయనతార:
కేరళలోని తిరువల్లలోని తిరుమూలపురంలోని బాలికా మాడోమ్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కేరళలోని తిరువల్లలోని మార్తోమా కాలేజీ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా అందుకున్నారు.
శ్రుతి హాసన్:
చెన్నైలోని లేడీ ఆండాళ్ వెంకట సుబ్బారావు స్కూల్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ముంబయిలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీ పట్టా పొందారు.
తమన్నా భాటియా:
మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ముంబయిలోని నేషనల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు.