ETV Bharat / entertainment

అలా చేయమని బలవంతం చేశారు - సూసైడ్​కు ప్రయత్నించా : 'బ్రహ్మముడి' అప్పు - Bramhamudi Serial Appu

'బ్రహ్మముడి సీరియల్‌' ఫేం అప్పు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఒకానొక దశలో రక్తం కూడా అమ్ముకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ వివరాలు.

అలా చేయమని బలవం చేశారు - సూసైడ్​కు ప్రయత్నించా : బ్రహ్మముడి అప్పు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:57 PM IST

Bramhamudi Serial Appu Career : 'బ్రహ్మముడి సీరియల్‌'లో అప్పు గురించి చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఆమె అసలు పేరు నైనీషా రాయ్. సినిమాలపై మక్కువతో బెంగాలీ నుంచి టాలీవుడ్​కు వచ్చి ఇక్కడే రాణించేలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అందుకే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసి ఇక్కడే ఉంటున్నట్లు తెలిపింది. అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. అలా కలిసి ఉంటే కలదు సుఖం, భాగ్య రేఖ, వంటలక్క, హంసగీతం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్‌లలో ఆఫర్లు అందుకుందట. ఇక శ్రీమంతుడు అనే సీరియల్‌లో లీడ్‌ రోల్‌లో చేస్తోంది.

Bramhamudi Serial Appu Serial Offers : తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది నైనీషా రాయ్. తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో కనీసం తినడానికి తిండి కూడా లేదని చెప్పింది. ఆకలి తీర్చుకునేందుకు ఓ దశలో తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్లు చెప్పి ఎమోషనల్ అయింది. ఎన్నో కష్టాలు పడ్డాను. ఆ సమయంలోనే పలు ఆఫర్లు వచ్చాయి. అయితే ఆఫర్లు ఇచ్చేవారు అవకాశం ఇస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగేవారు. కమిట్‌మెంట్‌ ఇవ్వాలని కండీషన్‌ పెట్టారు. ఒకానొక సమయంలో బలవంతం కూడా చేశారు. ఆ సమయంలో వాళ్లను కొట్టి ఏదోలా తప్పించుకున్నాను అని పేర్కొంది.

అయితే ఇంత జరిగినా కూడా తిరిగి ఇంటికి వెళ్లలేకపోయాను. ఒకవేళ వెళ్లినా కూడా వారు తిరిగి ఇంట్లోకి రానివ్వరు. ఎందుకంటే వారికి ఇష్టం లేనప్పటికీ విభేదించి మరీ ఇక్కడకు వచ్చాను కదా. అలాంటి సమయంలో ఏం చేయాలో అస్సలు తెలీయలేదు. చనిపోదామని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాను. అని నైనీషా రాయ్ తమ మనసులోని బాధను బయట పెట్టింది. ఇప్పటికీ కూడా అమ్మానాన్న మాట్లడరు అంటూ బాగా ఏమోషనల్‌ అయింది. మొత్తంగా అనేక కష్టాలు ఎదుర్కొని పలు ఆఫర్లు దక్కించుకుని ఇప్పుడీ స్థాయిలో ఉన్నట్లు నైనీషా రాయ్ చెప్పుకొచ్చింది.

ప్రియుడికి జబర్దస్త్ బ్యూటీ బ్రేకప్​ - దానికి ఒప్పుకోకపోవడం వల్లే!

డీజే టిల్లునా మాజాకా - ఊహించని రేంజ్​లో ఓటీటీ రైట్స్​ డీల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.