Salman Khan Comedy Movies: ఇటీవల కాలంలో పాపులర్ మూవీలు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా గుర్తింపు పొందుతున్నారు. కానీ, చాలా కాలం నుంచే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను అలరించారు. చాలా మందికి సల్మాన్ అంటే స్టైల్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రే గుర్తొస్తుంది. పవర్ ఫుల్ రోల్స్‌లోనే సల్మాన్‌ని ఊహించుకుంటారు. కానీ, సల్మాన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న ఫన్నీ మూవీస్ చాలానే ఉన్నాయి. మీకు ఎప్పుడైనా సల్మాన్ ఖాన్ కామెడీ సినిమాలు చూడాలనిపిస్తే! ప్రశాంతంగా కూర్చుని, కుటుంబంతో కలిసి చూడగల టాప్ 10 సినిమాలు ఇవే.
- అందాజ్ అప్నా అప్నా (1994) ఇందులో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రవీనా టాండన్, కరిష్మా కపూర్ యాక్ట్ చేశారు. IMDb రేటింగ్ 8.0/10గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్ & టీవీ, యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. బాలీవుడ్‌లో అల్టిమేట్ కల్ట్ క్లాసిక్ మూవీస్‌లో ఇదొకటి. ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించే అమర్, ప్రేమ్ పాత్రలు ఆకట్టుకుంటాయి. మరపురాని పాత్రలు, హాస్యం పంచే సంభాషణలు ఉన్న మూవీని కుటుంబంతో కలిసి చూడవచ్చు.
- జుడ్వా (1997) జుడ్వాలో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్, రంభ, ఖాదర్ ఖాన్, అనుపమ్ ఖేర్ నటించారు. IMDb రేటింగ్ 6.1/10గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ క్లాసిక్‌లో సల్మాన్ ఖాన్ కవల సోదరులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇద్దరూ పుట్టుకతో విడిపోతారు. లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను ఓడించడానికి అనుకోకుండా కలుస్తారు. స్టోరీ, సల్మాన్ యాక్షన్, కామెడీ అన్నీ అమితంగా ఆకట్టుకుంటాయి.
- బీవీ నం.1 (1999) ఇందులో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, కరిష్మా కపూర్, సుస్మితా సేన్, టబు నటించారు. IMDb రేటింగ్ 5.7/10గా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ కామెడీ మూవీ వివాహేతర సంబంధాల గురించి చర్చిస్తుంది. అద్భుతమైన డైలాగులతో ఆకట్టుకుంటుంది.
- చల్ మేరే భాయ్ (2000) ఇందులో సల్మాన్‌తో సంజయ్ దత్, కరిష్మా కపూర్ నటించారు. IMDb రేటింగ్ 4.7/10గా ఉంది.అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ ఇద్దరు సోదరుల స్టోరీ. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది.
- ముజ్సే షాదీ కరోగి (2004) ఇందులో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, అమ్రిష్ పూరి నటించారు. దీనికి IMDb రేటింగ్ 6.7/10 ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ కల్ట్ క్లాసిక్‌లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మధ్య సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
- మైనే ప్యార్ క్యున్ కియా (2005) సినిమాలో సల్మాన్ ఖాన్, సుస్మితా సేన్, కత్రినా కైఫ్ కీలక పాత్రలు పోషించారు. సినిమాకి IMDb రేటింగ్ 5.6/10 ఉంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఈ సినిమాకి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కడా బోర్ అనిపించదు.
- నో ఎంట్రీ (2005) నో ఎంట్రీ మూవీలో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్, బిపాషా బసు, లారా దత్తా ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీనికి IMDB రేటింగ్ 6.6/10గా ఉంది. జియోటీవీలో సినిమా చూడవచ్చు. ఈ మూవీలో హాస్య సన్నివేశాలే కాకుండా, పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. వీకెండ్‌లో చిల్ అవడానికి ఈ మూవీని సెలక్ట్ చేసుకోవచ్చు.
- పార్ట్‌నర్ (2007) ఇందులో సల్మాన్ ఖాన్, గోవిందా, లారా దత్తా, కత్రినా కైఫ్ కీలక పాత్రలు పోషించారు. IMDb రేటింగ్ 5.8/10 ఉంది. జియో సినిమా, జీ 5 ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో గోవింద పాత్రకి నిజమైన ప్రేమను కనుగొనడంలో సహాయపడే లవ్ గురూగా సల్మాన్ యాక్ట్ చేశారు. ఇద్దరి మధ్య హాస్య సంభాషణలు కచ్చితంగా ఆనందిస్తారు.
- రెడీ (2011) ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అసిన్ ప్రధాన పాత్రలు పోషించారు. IMDb రేటింగ్ 4.9/10. హాట్‌స్టార్, యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్ & టీవీలో అందుబాటులో ఉంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎంటర్‌టైనింగ్ పంచ్‌లను ఆస్వాదిస్తారు. వీకెండ్‌లో మీకు మంచి కాలక్షేపం అందిస్తుంది.
- కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (2023) ఇందులో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే, వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు తదితరులు నటించారు. దీనికి IMDb రేటింగ్ 4.0/10గా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో చూడవచ్చు. ఇటీవల వచ్చిన ఈ మూవీ కామెడీ, యాక్షన్, ఎమోషన్, డ్రామా, రొమాన్స్ కలయిగా ఉంటుంది. ప్యూర్ కామెడీతో బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది.