Star Hero Struggles: రజనీకాంత్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లాంటి నటులు సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో కష్టాలు అనుభవించారు. సూపర్ స్టార్ అవడం వెనుక పడ్డ కష్టమే వాళ్లను స్టార్ హీరోలను చేసింది. అలాంటి ఒక యాక్టరే ఈయన. ఒకప్పుడు ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేసి ఛాయ్ అందించిన వ్యక్తి, ఇప్పుడు ఇండియాలోని రిచెస్ట్ పర్సన్స్‌లో ఒకరిగా నిలిచారు. సూపర్ స్టార్స్ ఉన్న ఫ్యామిలీకి చెందిన ఈయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఆయనే అభిషేక్ బచ్చన్.
అందరూ అనుకున్నట్టు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ లాంటి స్టార్ల కొడుకైన అభిషేక్ బచ్చన్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టి ఉంటాడని అనుకుంటారు. ఏ కష్టాలు లేకుండా లైఫ్‌ను ఎంజాయ్ చేసి ఉంటాడని అనుకోవచ్చు. కానీ, జరిగింది వేరు. ముంబయిలోని జామ్నాబాయి నర్సీ స్కూల్, బాంబే స్కాటిష్ స్కూల్‌లలో ఆ తర్వాత న్యూ దిల్లీలోని మోడరన్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఐగ్లోన్ కాలేజిలో ఇంటర్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో చేరారు. అప్పుడే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తండ్రి అమితాబ్ బచ్చన్‌కు అండగా నిలిచేందుకు చదువు వదిలేసి వచ్చేశారు. ఒక ఇంటర్వ్యూలో తన సినిమా కష్టాల గురించి చెప్పిన ఆయన, 'ఒకప్పుడు ప్రొడక్షన్ బాయ్‌గా పనిచేస్తూ టీ కప్పులు అందించేవాడిని. స్టూడియో ఫ్లోర్లు క్లీన్ చేసేవాడిని. అర్షద్ వార్సీకి డ్రైవర్‌గా కూడా పనిచేశాను' అని చెప్పుకొచ్చారు.
కరీనా కపూర్‌తో నటించిన తొలి సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తన తర్వాత 9 సినిమాల్లోనూ ప్లాప్లే ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు 2004లో వచ్చిన 'ధూమ్' సినిమా ఆయన కెరీర్‌ను గాడిలో పెట్టింది. జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రా లాంటి స్టార్లతో తీసిన సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 'బంటీ ఔర్ బబ్లీ', 'సర్కార్', 'ధూమ్ 2', 'గురు', 'బోల్ బచ్చన్', 'ధూమ్ 3', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాల్లో కనిపించారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఓటీటీల్లోకి ఎంటర్ అవుతూ 'Breath' అనే ప్రాజెక్టులో కనిపించారు. తన లాస్ట్ సినిమా గూమర్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆయన ఆస్తుల విలువ రూ.280కోట్లు. అంతేకాదు లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితం, ఒక కబడ్డీ టీమ్‌కు యజమాని కూడా. ఆయన తండ్రికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉండటంతో వేకేషన్‌కు వెళ్లేందుకు భార్య ఐశ్వర్యారాయ్‌తో కలిసి అందులోనే బయటకు వెళ్తుంటారట.
చేసిన ఐదు సినిమాలు ప్లాప్ - కానీ నయన్, తమన్నా కన్నా ఈమెకే క్రేజ్ ఎక్కువ! - Most popular Heroine
సినిమాకు ఇన్సూరెన్స్- 25ఏళ్ల క్రితమే 5 రెట్లు లాభం! - First Indian film to be insured